Advertisement

మెగా డాటర్ కెరియర్ కు దెబ్బేసినట్లే

Posted : May 16, 2020 at 4:15 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌లో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు సక్సెస్ అయ్యారేమో కానీ హీరోయిన్లు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లినవారే. అక్కినేని వారసురాలిగా వచ్చిన సుప్రియ, కృష్ణ కూతురు మంజుల అలా తెరపై కనిపించి, కొద్దిరోజుల్లోనే తెర వెనక్కి వెళ్లిపోయారు. అయితే కొణిదెల వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మాత్రం ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేలా కనిపించింది. డిఫరెంట్ యాటిట్యూడ్, మేనరిజంతో క్రేజ్ ప్లస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నిహారిక… భవిష్యత్తులో మంచి హీరోయిన్‌గా ఎదగాలనే ఆశపడింది కూడా. అయితే ఆమె కెరీర్‌కు ఆదిలోనే బ్రేక్‌లు పడుతున్నట్టు టాక్.

‘ఒక మనసు’, ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాల్లో ఎంతో పద్ధతైన పక్కింటి అమ్మాయి పాత్రల్లో కనిపించిన నిహారిక… సక్సెస్ రాకపోవడంతో రూట్ మార్చి, హాట్ హీరోయిన్‌గా చెలరేగిపోవాలనుకుంది. హాట్ ఫోటోషూట్స్, గ్లామరస్ ఫోజులు, రొమాంటిక్ డ్యాన్సులతో తనలోని హాట్ యాంగిల్‌ను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది కూడా.అయితే ఆమె కెరీర్ ప్లాన్స్‌కు ఊహించిన బ్రేక్ వేశాడు తండ్రి.. మెగా బ్రదర్ నాగబాబు.

త్వరలో నిహారిక పెళ్లి చేయబోతున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం నిహారిక కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, మంచి వరుడు దొరకగానే మెగా డాటర్ పెళ్లి చేయబోతున్నట్టు చెప్పిన నాగబాబు, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో మ్యారేజ్ ఉంటుందని టైమ్ కూడా ఫిక్స్ చేశాడు. ఇప్పుడిప్పుడే హాట్ ఫోటోషూట్ ద్వారా టాలీవుడ్ అటెన్షన్ పొందాలని ప్రయత్నిస్తోంది నిహారిక. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడడంతో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తండ్రి పెళ్లి గురించి ప్రకటించడంతో నిహారికకు ఛాన్స్ ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవచ్చు. పెద్దగా టైమ్ కూడా లేకపోవడంతో ఈ సమయంలో నిహారిక ఎన్ని సినిమాలు చేస్తుందో అవే ఆమె కెరీర్‌లో లాస్ట్ మూవీస్ కావచ్చు.

త్వరలో ఓ కోలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు కన్ఫార్మ్ చేసింది నిహారిక. తెలుగులో అయితే ఇంకా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. మరి మెగా డాటర్, తండ్రి మాట మీద నిలబడి… త్వరలో పెళ్లికి సై అంటుందో, కెరీర్ కోసం పెళ్లిని వాయిదా చేస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

AP Deputy CM Pawan Kalyan : సార్ .. ఆన్ డ్యూటీ..!! –

Posted : June 19, 2024 at 10:43 pm IST by ManaTeluguMovies

AP Deputy CM Pawan Kalyan : సార్ .. ఆన్ డ్యూటీ..!! –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement