Advertisement

మెగా డాటర్ నిహారిక పెళ్లాడబోయే చైతన్య పూర్తి వివరాలు.!

Posted : June 19, 2020 at 1:09 pm IST by ManaTeluguMovies

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల మిస్ నుంచి మిసెస్ గా మారనున్న వార్త గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఇంట జరగబోయే పెళ్లి సందడి గురించి మొదట తెలిపింది తెలుగుబుల్లెటిన్.కామ్.. జూన్ 18న తనకి కాబోయే వరుడి పేస్ చూపించకుండా ఫోటో పోస్ట్ చేసి దోబూచులాడింది నిహారిక..

ఇప్పుడు అతనెవరో తెలిసింది. నిహారిక పెళ్లి చేసుకోనున్న వరుడు ఓ టెక్కీ.. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ.. ప్రస్తుతం చైతన్య ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతను ఎవరు అనే వివరాల్లోకి వెళితే. గుంటూరు సిటీ ఐజి ప్రభాకర్ రావు జొన్నలగడ్డ కుమారుడే ఈ చైతన్య. అలాగే చైతన్య బిట్ పిలానీ మరియు ఐఎస్బి లలో తన చదువును ఫినిష్ చేసి ప్రస్తుతం అతను టెక్ మహీంద్రా లో ఓ మంచి జాబ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబసభ్యులు కూర్చొని అన్ని ఫైనల్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆగష్టు 13న నిశ్చితార్ధం చేసి, ఆ తరువాత ముహూర్తానికి పెళ్లి జరిపించాలని నాగబాబు ప్లాన్ చేస్తున్నారట. అలాగే వరుడి విషయంలో నిహారిక కూడా ఫుల్ హ్యాపీ అని సన్నిహితులు అంటున్నారు.


Advertisement

Recent Random Post:

DJ Dhamaka in Sydney – 28th April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Posted : April 23, 2024 at 2:07 pm IST by ManaTeluguMovies

DJ Dhamaka in Sydney – 28th April 2024 at 7 PM in #Etvtelgu – Pradeep,Hyper Aadi, Chammak Chandra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement