Advertisement

మాస్‌ ఇమేజ్‌ కోసం యంగ్‌ హీరో ప్రయత్నాలు

Posted : October 12, 2020 at 11:07 pm IST by ManaTeluguMovies

హ్యాపీ డేస్‌ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న నిఖిల్‌ ఆ తర్వాత సోలో హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒకటి సక్సెస్‌ అయితే రెండు మూడు ఫ్లాప్స్‌ అవుతున్నాయి. అయినా కూడా ఆయన తన క్రేజ్‌ కు తగ్గట్లుగా ఇప్పటి వరకు సినిమాలు చేస్తు వచ్చాడు.

ప్రస్తుతం కార్తికేయ 2 మరియు 18 పేజెస్‌ చిత్రాలను చేస్తున్న ఈ యంగ్‌ హీరో ఇప్పటి వరకు పూర్తి స్తాయి మాస్‌ ఎంటర్‌ టైనర్‌ ను చేయలేదు. ప్రస్తుతం ఈయన ఒక మాస్‌ మసాలా సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ ను చూస్తున్నాడట.

తన వద్దకు వచ్చిన ప్రతి దర్శకుడికి మరియు రచయితలకు మాస్‌ సబ్జెక్ట్‌ కావాలంటూ కోరాడట. నిఖిల్‌ ఇమేజ్‌ కు మాస్‌ సినిమా సెట్‌ అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే ఎవరైననా నిఖిల్‌ కోసం మాస్‌ సబ్జెక్ట్‌ తయారు చేసినా కూడా ఆ సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు అంతగా ధైర్యం చేస్తారా అనేది అనుమానమే.

ఎందుకంటే నిఖిల్‌ తో మాస్‌ సినిమా అంటే జూదంతో సమానం. ఖచ్చితంగా నిఖిల్‌ తో మాస్‌ సినిమా వర్కౌట్‌ అవుతుందనే నమ్మకం ఉండనప్పుడు అతడిపై ఎలా అంత బడ్జెట్‌ పెడతారంటూ అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాత మరియు దర్శకుడు సెట్‌ అయ్యి నిఖిల్‌ మాస్‌ మూవీ చేసేనా చూడాలి.


Advertisement

Recent Random Post:

ఇజ్రాయెల్ పోరు | Middle East Crisis | 8 Israel Soldiers Dead As Hezbollah Claims To Repel incursion

Posted : October 3, 2024 at 1:57 pm IST by ManaTeluguMovies

ఇజ్రాయెల్ పోరు | Middle East Crisis | 8 Israel Soldiers Dead As Hezbollah Claims To Repel incursion

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad