Advertisement

నితిన్ పెళ్లికి పవన్ తో లింక్?

Posted : May 15, 2020 at 7:41 pm IST by ManaTeluguMovies

లాక్ డౌన్ కారణంగా నిఖిల్, నితిన్ పెళ్లిళ్లు ఒకేసారి వాయిదాపడ్డాయి. అయితే పదే పదే లాక్ డౌన్ ను పొడిగిస్తుండడం.. పైగా రాబోయే రోజుల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో నిఖిల్ ఆఘమేఘాల మీద ముహూర్తం ఫిక్స్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు నితిన్ వైపు మళ్లింది.

నిఖిల్ తరహాలోనే నితిన్ కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లో, పరిమిత సంఖ్యలో బంధువుల మధ్య పెళ్లి చేసుకుంటాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ నితిన్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. స్నేహితులు, బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో తన పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని అనుకుంటున్నాడట నితిన్.

మరీ ముఖ్యంగా తన వివాహానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట నితిన్. అందుకే ఈ లాక్ డౌన్ టైమ్ లో కాకుండా.. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఓ మంచి రోజు చూసి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

నితిన్-షాలిని ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా తన లవ్ మేటర్ ను బయటపెట్టాడు నితిన్. ఏప్రిల్ 16న దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ లాక్ డౌన్ కారణంగా పెళ్లి నిరవథికంగా వాయిదాపడింది.


Advertisement

Recent Random Post:

కూటమికి ముప్పుతిప్పలు పెడుతున్న గాజు గ్లాసు | Janasena | OTR

Posted : April 26, 2024 at 12:31 pm IST by ManaTeluguMovies

కూటమికి ముప్పుతిప్పలు పెడుతున్న గాజు గ్లాసు | Janasena | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement