యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. వీళ్ళిద్దరూ పోరాటానికి ముందు మనకు తెలియని కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని మలుస్తున్నాడు. ఫిక్షనల్ అంశాలు బాగానే దట్టించినట్లు టాక్.
రామ్ చరణ్ పుట్టినరోజున రామరాజును మనకు పరిచయం చేసిన జక్కన్న ఎన్టీఆర్ పుట్టినరోజున భీమ్ ను కూడా పరిచయం చేస్తారని ముందు అంతా అనుకున్నారు. అయితే లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తూ రావడంతో ఎన్టీఆర్ పుట్టినరోజున వీడియో రిలీజ్ ఉండదని, కేవలం పోస్టర్ రిలీజ్ తో సరిపెట్టేస్తారని వార్తలు వచ్చాయి.
భీం కు సంబందించిన విజువల్స్ ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ వద్ద లేవని, అందుకే సర్ప్రైజ్ ఉండదని అన్నారు. అయితే అదంతా ఒట్టి రూమర్సేనట. కచ్చితంగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు వీడియో ఉంటుందని తెలుస్తోంది.
నిమిషమున్నర నిడివి కల ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇవ్వడం ఖాయమని సమాచారం. ఇక చరణ్ వీడియోకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు, ఎన్టీఆర్ వీడియోకు చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. భీమ్ గా పూర్తి పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడట.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 8, 2021న విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేకపోవడంతో చిత్రం వాయిదా పడే ఆస్కారం ఉంది.