Advertisement

ఎన్టీఆర్31… ఇదెక్కడి ట్విస్ట్ బాబోయ్

Posted : June 11, 2022 at 12:17 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ 30 సినిమా ఆలస్యం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమా ను ప్రారంభించబోతున్నారు. మరో వైపు ఎన్టీఆర్ 31 పై అంచనాలు భారీగా ఉన్నాయి.

కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ని తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం సలార్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ ఏడాది చివర్లో ఎన్టీఆర్ 31 ను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ 31 సినిమా పై గత కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సినిమా గురించి కొత్త పుకారు అంచనాలను మరింతగా పెంచుతోంది. సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. కేజీఎఫ్ లో ఎలా అయితే రాఖీ భాయ్ నెగటివ్ షేడ్స్ తో కనిపిస్తాడో అలాగే ఎన్టీఆర్ 31 లో ఎన్టీఆర్ ను కూడా ఒక పవర్ ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నారట.

హీరోగా ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ గతంలో జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో ఒక పాత్రను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడటం జరిగింది.

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను ఎన్టీఆర్ దున్నేస్తాడనే నమ్మకంను ఆ సినిమా తోనే అభిమానులకు కలిగించాడు. అందుకే ఎన్టీఆర్ 31 సినిమాను ఖచ్చితంగా అంతకు మించి అన్నట్లుగా చేస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఎన్టీఆర్ 31 ప్రారంభంకు ముందే ఇన్ని పుకార్లు వస్తూ ఉన్నాయంటే.. ఒక వేళ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఏ స్థాయిలో జోరు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో ఎన్టీఆర్ 31 గురించి ఏదో ఒక విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ 30 సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ఎన్టీఆర్ 31 ఎప్పుడు వస్తుందో అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

#NTR30 Shoot Begins – Telugu | NTR | Janhvi Kapoor | Koratala Siva | Anirudh Ravichander

Posted : April 1, 2023 at 7:02 pm IST by ManaTeluguMovies

Watch #NTR30 Shoot Begins – Telugu | NTR | Janhvi Kapoor | Koratala Siva | Anirudh Ravichander

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement