Advertisement

ఎన్టీఆర్ అభిమానులపై లాక్ డౌన్ ప్రభావం

Posted : May 18, 2020 at 4:20 pm IST by ManaTeluguMovies

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ వస్తుందనుకున్నారు. అది సాధ్యం కాదని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కనీసం చిన్న పోస్టర్ అయినా వస్తుందనుకున్నారు. కానీ తారక్ అభిమానులపై యూనిట్ నీళ్లుచల్లింది. టీజర్ కాదు కదా, కనీసం పోస్టర్ కూడా విడుదల చేసేది లేదని క్లియర్ గా చెప్పేసింది. ఈరోజు ఆర్ఆర్ఆర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

“లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పొడిగిస్తున్న కారణంగా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అప్పటికీ మేం గట్టిగా ప్రయత్నించినప్పటికీ తారక్ బర్త్ డే సందర్భంగా అతడి టీజర్ ను రెడీ చేయలేకపోయాం. సో.. ఈ పుట్టినరోజుకు తారక్ ఫస్ట్ లుక్ లేదా వీడియో ఏదీ రిలీజ్ చేయలేకపోతున్నాం.”

పుట్టినరోజు కోసం ఏదో ఒకటి రిలీజ్ చేసి చేతులు దులుపుకోవడం ఇష్టంలేదని ప్రకటించిన యూనిట్.. అందరి ఎదురుచూపులు ఫలించేలా బ్రహ్మాండంగా టీజర్ ఉంటుందని ప్రకటించింది. ఎప్పుడు తారక్ టీజర్ వస్తుందో అప్పుడే అసలైన పండగని తెలిపింది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై కూడా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే తాము పెట్టుకున్న బఫర్ టైమ్ అయిపోయిందని, సెట్స్ పైకి వెళ్లేవరకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది చెప్పలేమని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. సో.. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై లాక్ డౌన్ తర్వాత ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.


Advertisement

Recent Random Post:

🔴LIVE : ABN MD Radhakrishna Big Debate With TDP MP Candidate Pemmasani Chandrasekhar

Posted : April 24, 2024 at 7:19 pm IST by ManaTeluguMovies

🔴LIVE : ABN MD Radhakrishna Big Debate With TDP MP Candidate Pemmasani Chandrasekhar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement