Advertisement

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

Posted : May 20, 2020 at 8:21 pm IST by ManaTeluguMovies

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు చెప్పి ఊరుకోకుండా నేడు ఆయన బర్త్‌డే సందర్బంగా ఒక ర్యాప్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ర్యాప్‌ సాంగ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నందమూరి ఫ్యాన్స్‌ ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్స్‌ చేస్తున్నారు.

ఫలక్‌నుమా దాస్‌ చిత్రంతో హీరోగా మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ యువ హీరో ఇప్పుడు నందమూరి అభిమానులను తన బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఈ వీడియో చూసిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు ఈ వీడియో షేర్‌ చేయడంతో పాటు విశ్వక్‌ సేన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోతో ఒక్కసారిగా తన ఫాలోవర్స్‌ సంఖ్యను అమాంతం పెంచేసుకున్నాడు.

ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్‌ ఇలా అయినా విశ్వక్‌ సేన్‌కు కాస్త మద్దతుగా నిలిస్తే ఖచ్చితంగా తన తోటి యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ విషయంలో చర్చ జరుగుతుంది. కాని విశ్వక్‌ సేన్‌ మాత్రం తాను కేవలం ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ ర్యాప్‌ సాంగ్‌ను విడుదల చేసినట్లుగా సన్నిహితుల వద్ద చెబుతున్నాడు.


Advertisement

Recent Random Post:

YCP : Getting Ready For 3rd Phase Election Campaign | CM Jagan

Posted : April 22, 2024 at 6:26 pm IST by ManaTeluguMovies

YCP : Getting Ready For 3rd Phase Election Campaign | CM Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement