Advertisement

డిజాస్టర్ అయ్యుండొచ్చు కానీ

Posted : April 26, 2020 at 10:17 pm IST by ManaTeluguMovies

సోషల్ మీడియా జోరు పెరిగాక పాత సినిమాలకు వార్షికోత్సవాలు జరపడం.. అప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడం కామన్ అయిపోయింది. ఆయా చిత్రాల రూపకర్తలతో పాటు అభిమానులు కూడా పాత రోజుల్లోకి వెళ్లిపోయి అప్పటి అనుభవాల్ని గుర్తు చేసుకుంటున్నారు.

తాజాగా ‘జానీ’ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఇక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అందుకున్నారు. అప్పట్లో ఈ సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదో నెమరు వేసుకుంటున్నారు.

‘జానీ’ సినిమా డిజాస్టర్ అయితే అయ్యుండొచ్చు కానీ.. నిజంగా ఆ సినిమా రిలీజ్ ముంగిట ఉన్న యుఫూరియా అలాంటిలాంటిది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ను సూపర్ స్టార్‌ను చేసిన ‘ఖుషి’ తర్వాత అతడి నుంచి వచ్చిన సినిమా ఇది. పైగా తిరుగులేని సక్సెస్ రేట్ ఉన్న గీతా ఆర్ట్స్ నిర్మించింది. పైగా పవన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

‘జానీ’ ప్రారంభమైన దగ్గర్నుంచి దీనికి విపరీతమైన క్రేజ్ కనిపించింది. దీనికి రమణ గోగుల తన కెరీర్ బెస్ట్ ఆడియోతో అంచనాల్ని పెంచేశాడు. టైటిల్ సాంగ్ మొదలుకుని.. ఈ రేయి తీయనిది, ఏ చోట నువ్వున్నా పాటలు మార్మోగిపోయాయి. ఈ సినిమా ప్రోమోల్లో పవన్ ఉపయోగించిన ‘జానీ’ కర్చీఫ్‌లకు బయట విపరీతమైన డిమాండ్ కనిపించింది.

‘జానీ’ కర్చీఫ్‌లు ఉండటాన్ని యూత్ ఒక ప్రివిలేజ్‌గా భావించేవాళ్లు. పవన్ స్టయిల్లో చిరిగిన జీన్సులేసుకుని కుర్రాళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పటికే తమ్ముడు, ఖుషి లాంటి సినిమాల్లో పవన్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపించాడు. ‘జానీ’ పూర్తిగా ఆ నేపథ్యంలోనే తెరకెక్కిన సినిమా కావడతో అభిమానులకు మార్షల్ ఆర్ట్స్ పిచ్చి బాగా ఎక్కేసింది.
అప్పటికి తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 250 ప్రింట్లతో రిలీజై రికార్డు సృష్టించిందీ సినిమా. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని చోట్లా పవన్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఐతే ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అని.. ఫైట్లతో పవన్ ఉర్రూతలూగించేస్తాడని.. గూస్ బంప్స్ ఖాయమని అనుకున్నారు.

ఐతే ఫైట్ల వరకు బాగానే ఉన్నా.. సినిమా మరీ నెమ్మదిగా సాగడం.. ఒక దశ దాటాక నీరసం వచ్చేయడంతో జనాలు తట్టుకోలేకపోయారు. హీరోయిన్ని అలా చూడలేకపోయారు. సినిమా డిజాస్టర్ అయింది. పవన్ తన రెమ్యూనరేషన్ వెనక్కిచ్చి మరీ డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేయాల్సి వచ్చింది. ఐతే సినిమా అప్పటికి డిజాస్టర్ అయినా.. కాల క్రమంలో ఇదో మంచి సినిమాగానే గుర్తింపు పొందింది. దీన్నో క్లాసిక్‌గా చూసే ప్రేక్షకులూ ఉన్నారు.


Advertisement

Recent Random Post:

Be Alert : తల్లి కోసం కూతురు దారుణ నిర్ణయం

Posted : October 31, 2024 at 12:54 pm IST by ManaTeluguMovies

Be Alert : తల్లి కోసం కూతురు దారుణ నిర్ణయం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad