Advertisement

ప్రతి ఒక్కరినీ ‘ఖుషీ’ మాయలో పడేసిన టాప్ 5 పాయింట్స్

Posted : April 27, 2020 at 4:23 pm IST by ManaTeluguMovies

అప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా, ఆయన సినిమాలన్నా యూత్ లో సూపర్ క్రేజ్.. కానీ 2001 ఏప్రిల్ 27న ‘ఖుషి’ అనే సినిమా రిలీజై తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పడమే కాకుండా, పవన్ కళ్యాణ్ క్రేజ్ రెండు మూడింతలు పెంచి తెలుగు సినిమా ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్డంని తెచ్చి పెట్టిన సినిమా ఇది. చాలా సింపుల్ స్టోరీ లైన్ ని స్క్రీన్ ప్లే తో ఇంత ఎంగేజింగ్ గా చెప్పచ్చా అని ప్రూవ్ చేసిన సినిమా ‘ఖుషి’.

‘ఖుషి’ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇంకా ఈ తరం లవ్ స్టోరీస్ లో కూడా కనపడుతూనే ఉంటుంది.. ఈ సినిమాలోని సీన్స్ ని ఎన్నో సినిమాలో ఇన్స్పైర్ అయ్యారు అలాగే.. స్పూఫ్ లు గా కూడా వాడుతూనే ఉన్నారు. అభిమానుల్ని, సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమాలోని టాప్ 5 పాయింట్స్..

1. పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్..

ఖుషి సినిమా సక్సెస్ కి ఆ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ ఎంత లవ్లీ గా అనిపిస్తాయి. ఇవి సినిమా సక్సెస్ కి ఒక 50% అయితే మిగతా 50% పవన్ కళ్యాణ్ ఒక్కరే తన భుజాల మీద మోసారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ అల్ట్రా స్టైలిష్ లుక్, సూపర్బ్ ఎనర్జిటిక్ కాలేజ్ కుర్రాడిలా పెర్ఫార్మన్స్ అందరినీ ప్రేమలో పడేశాయి. ఖుషి బాగ్స్, గ్యాప్ హుడీస్, ట్ షర్ట్ మీద ట్ షర్ట్ లాంటి స్టైల్స్ పరిచయం చేశారు. అలాగే ఈ సినిమాకి స్టంట్ కో ఆర్డినేటర్ కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అలాగే బై బయ్యె బంగారు రావణమ్మ అంటూ శ్రీకాకుళం స్లాంగ్ పాట పడటమే కాకూండా, ఏ మెరాజహా, ప్రేమంటే సులువుకాదురా, ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే పాటలకు సాంగ్ కాన్సెప్ట్ డిజైన్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే కావడం ఇంకో స్పెషల్.

2. కాలేజ్ ఎపిసోడ్స్ అండ్ పవన్ కళ్యాణ్ – భూమిక కెమిస్టీ

దీపాలు ఆర్పే సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ లో తమ పిల్లల గురించి ఇంటర్వ్యూ ఇచ్చే వరకూ పవన్ కళ్యాణ్ భూమికలు మధ్య ఉండే కెమిస్ట్రీ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ప్రతి సీన్ లోనూ వీరిద్దరి కెమిస్ట్రీ ఆ రేంజ్ లో వర్కౌట్ కాకపోయి ఉంటే సినిమా అంతపెద్ద విజయం సర్థిచెడి కాదేమో.. సో పవన్ కళ్యాణ్ -భూమికలది ది బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అని చెప్పాలి. అలాగే క్లాఎజ్ ఎపిసోడ్ లో ప్రతి సీన్ చాలా లవ్లీగా ఉంటుంది. ఇప్పటికీ పలువురు యంగ్ డైరెక్టర్స్ ఈ రిఫరెన్స్ లు వాడుతుంటారు.

3. నడుము సీన్ అలియాస్ ఇంటర్వల్ ఎపిసోడ్

సినిమాని పతాకస్థాయికి తీసుకెళ్లే సీన్ మాత్రం ఇంటర్వల్లో వచ్చే నడుము సీన్.. అసలు ఇలాంటి ఒక సీన్ తో ఇంటర్వల్ బాంగ్ ని పీక్స్ కి తీసుకెళ్ళచ్చు అని ప్రూవ్ చేసిన ఎస్.జె సూర్య కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సీన్ కి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరేమో. ఈ సీన్ ని ఇప్పటికి ఎన్నో సార్లు పలువురు పలు రకాలుగా తమ సినిమాల్లో వాడుకుంటూనే ఉంటున్నారు.

4. మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన మణిశర్మ

మెలోడీ బ్రహ్మ అన్న టాగ్ లైన్ మణిశర్మకి పర్ఫెక్ట్ అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఖుషి. ప్రతి సీన్ ని, ప్రతి ఎమోషన్ ని, ప్రతి ఫీలింగ్ డైరెక్ట్ గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేసింది మాత్రం మణిశర్మ మ్యూజిక్కే.. అలాగే ప్రతి పాత ఓ ఆణిముత్యమే.. ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా చాలా న్యూ గా ఉంటాయి.. అప్పట్లో ఫంక్షన్ ఏదైనా వినిపించిన ఒకే ఒక్క పాట ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’.

5. అలీ మందు సీన్, ఊపిరి పీల్చలా అండ్ క్లైమాక్స్

ఇక సినిమాలో ఎప్పటికప్పుడు మనల్ని మెస్మరైజ్ చేసే సీన్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రతి కాలేజ్ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేస్తే.. సెకండాఫ్ లో అలీతో వచ్చే గుడుంబా సీన్, అందులో పవన్ కళ్యాణ్ పోస్టర్ తో మాట్లాడే సీన్, ఊపిరి పీల్చాలా అని వచ్చే సీన్ మరియు క్లైమాక్స్ లో మీరు గుడుంబా సత్తిగారు కావచ్చు తొక్కలో సత్తిగారు కావచ్చు.. బట్ ఐ డోంట్ కేర్, బికాస్ ఐయామ్ సిద్దు సిద్దార్థ్ రాయ్.. ఈ డైలాగ్ ఇప్పటికీ అందరి నుంచీ రీ సౌండ్ గా వినిపిస్తూనే ఉంటుంది.

మరింకెందుకు ఆలస్యం అప్పట్లో మీ కాలేజ్ డేస్ ని, ఆ సినిమా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్స్ గుర్తు చేసుకొని ఓ సారి సినిమా చూసేసి మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో తెలపండి.


Advertisement

Recent Random Post:

అమెరికాలో ఇస్రో శాటిలైట్ ప్రయోగం

Posted : November 16, 2024 at 5:59 pm IST by ManaTeluguMovies

అమెరికాలో ఇస్రో శాటిలైట్ ప్రయోగం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad