కళ్ళు లేని గుడ్డితనం కాదిది. కళ్ళున్న గుడ్డితనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంట్లోంచి బయటకు రావడంలేదట. ‘ఐసోలేషన్’ ఇంకెన్నాళ్ళంటూ కులగజ్జి మీడియా అడ్డగోలు విమర్శలు అప్పుడే మొదలెట్టేసింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకోవడానికి జనసేనానికి ఎక్కువ సమయమే పట్టింది. కరోనా సోకి, వెంటనే తగ్గితే, పెద్దగా ఆరోగ్యపరమైన సమస్యలేమీ వుండవు.
ఎక్కువ రోజులు కరోనాతో బాధపడితే, కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులు అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. సరే, పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగింది.? అన్నది వేరే చర్చ. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్, రోడ్డెక్కి ఆందోళనలు చేసెయ్యాల్సిన అవసరం వుందా.? చేస్తారు.. తన ఆరోగ్యం గురించి ఆయనకెప్పుడూ దిగులు లేదు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే, ‘బాధ్యత లేదా.?’ అంటూ దిక్కుమాలిన చర్చల్ని ఇదే కులగజ్జి మీడియా తెరపైకి తెస్తుంది. ఇక, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? జనసేన పార్టీ ఏం చేస్తోంది.? అని ప్రశ్నించేవారికి సమాధానం, కళ్ళతో చూస్తే కనిపిస్తుంది. కళ్ళుండీ కబోదుల్లా వ్యవహరిస్తే ఎలా.? జనసైనికులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ అవసరమైనవారిని ఆదుకుంటున్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లను సమకూర్చుతున్నారు.. ప్లాస్మా డొనేషన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్ని చోట్ల అయితే కరోనా బాధితుల ఇళ్ళ వద్దకే ఆక్సిజన్ సిలెండర్లను సొంత ఖర్చుతో అందిస్తున్నారు జనసైనికులు. ఇవేవీ కులగజ్జి మీడియాకి కనిపించవు. కనిపిస్తే అది కులగజ్జి మీడియా ఎందుకు అవుతుంది.? కళ్ళకున్న ఆ బులుగు, పచ్చ పొరలు తొలగిపోతే, ఆ రెండు కులగజ్జి మీడియా సంస్థలకీ వాస్తవం కన్పిస్తుంది. జనసేనాని ఓ పిలుపు ఇస్తే చాలు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఊరూ వాడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు.
ఆర్థిక సాయం, వైద్యం పరంగా సాయం, మందులు, ఆక్సిజన్.. ఇలా అన్ని రకాలైన సాయం వీలైనంత ఎక్కువమందికి అందించేందుకు జనసైనికులు తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ముందుకొస్తున్నరు. కరోనా విపత్తు వేళ, అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న జనసైనికుల్ని గుర్తించకపోవడం సోకాల్డ్ మీడియా దౌర్భాగ్యం.