కరోనా లాక్ డౌన్ దాదాపు క్లియర్ అయిపోతోంది. టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ప్రారంభం కాలేదు కానీ, అనేకానేక గ్యాసిప్ లు షురూ అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు. ఎన్నో సినిమాల ప్లానింగ్ లు గ్యాసిప్ ల్లో కనిపిస్తున్నాయి. సరే, అవన్నీ మెటీరియలైజ్ అవుతాయా? కాదా? నిజమా? టైమ్ పాస్ కోసమా? అన్నది పక్కన పెడితే, అలా వినిపించిన గ్యాసిప్ ఒకటి మలయాళ సిసిమా డ్రయివింగ్ లైసెన్స్ తెలగు రీమేక్.
ఓ పెద్ద నిర్మాత హక్కులు కొంటున్నారని, ఓ అగ్ర హీరో నటిస్తారని ఇలా చాలా చాలా. కానీ వాస్తవం ఏమిటంటే, ఇప్పటిక వరకు డ్రయివింగ్ లైసెన్స్ సినిమా హక్కులు ఎవ్వరూ కొనలేదు. నిర్మాత, అలాగే సినిమా హీరో పృధ్వీరాజ్ ఇద్దరూ అందుబాటులో లేరు, పైగా వాళ్లు కోట్ చేస్తున్న రేటు, చెబుతున్న టర్మ్స్ తెలుగు నిర్మాతలకు కాస్త దూరంగా వున్నాయి.
ఇదిలా వుంటే పవన్ కళ్యాణ్ కనుక ఈ సినిమా చేస్తే కొనే ఆలోచనలో వున్నారని, అలాగే పవన్ ఇంట్రస్ట్ గా వున్నారని మరో గ్యాసిప్. దీంతో మళ్లీ వార్తల్లోకి ఈ సినిమా వచ్చేసింది. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చూడనేలేదు. అంతే కాదు, ఆ సినిమా గురించి విని, అందులోని ఒకటి రెండు సీన్లు అడిగి తెలుసుకుని, అంత ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది. దాంతో ఇక సినిమా చూసే ఐడియానే డ్రాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా మొత్తానికి ప్రస్తుతానికి డ్రయివింగ్ లైసెన్స్..పవన్ కళ్యాణ్ అన్న గ్యాసిప్ కు తెరపడిందనే అనుకోవాలి.