Advertisement

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మీద ఏడుపెందుకు.?

Posted : December 24, 2021 at 3:28 pm IST by ManaTeluguMovies

సినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది ఆయనతో సినిమాలు నిర్మించే నిర్మాతలకు సంబంధించిన వ్యవహారం. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి.? ఎంత బడ్జెట్ పెడితే, సినిమా వర్కవుట్ అవుతుంది.? అన్న విషయాల్ని పరిగణనలోకి తీసుకునే నిర్మాతలు ఆయనతో సినిమాలు చేస్తుంటారు.

అదేంటో, సినీ నిర్మాతలకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది లేదుగానీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలకు మాత్రం, అదో పెద్ద సమస్య అయిపోయింది. జనసేన అధ్యక్షుడిగా అయినా, సినీ నటుడిగా అయినా పవన్ కళ్యాణ్ ఏదన్నా విషయమ్మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ముందుగా పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్ళిళ్ళ ప్రస్తావన, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తావన తప్ప.. ఇంకో సోయ వుండడంలేదు వైసీపీ నేతలకి.

ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా వివాదం నడుస్తోంది. సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తగ్గించిన సినిమా టిక్కెట్ల రేట్ల పట్ల సినీ నటుడు నాని ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్ల యాజమాన్యాలు ఈ విషయమై గగ్గోలు పెడుతున్నాయి. చాలామంది నిర్మాతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో లేని సమస్య, వేరే ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని సమస్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు వస్తోంది.? అంటే, సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ అంటే ఏపీలోని అధికార వైసీపీకి నచ్చదు గనుక. ఆ పవన్ కళ్యాణ్ మీద కసితో, మొత్తం సినీ రంగాన్ని ఇబ్బంది పెడుతోందన్నమాట వైసీపీ.

లేకపోతే, ‘వకీల్ సాబ్’ సినిమా బడ్జెట్ ఎంత.? ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత.? పవన్ గనుక రెమ్యునరేషన్ తగ్గించుకుంటే, రాష్ట్రంలో తగ్గించిన సినిమా టిక్కెట్ల వల్ల ఏ నిర్మాతకీ ఇబ్బంది రాదని సాక్షాత్తూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడమేంటి.?

‘ముందైతే అధికారంలో వున్నవారు తమ లగ్జరీస్ తగ్గించుకోండి.. మేం కట్టిన పన్నులతో మీరు లగ్జరీలు చేయడమేంటి.?’ అంటూ సినీ నటుడు సిద్దార్ధ సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులకు, అధికారంలో వున్నవారికి సంధించిన ట్వీటాస్త్రాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.


Advertisement

Recent Random Post:

Supreme Court Directs CBI On RG Kar Case, Orders Safety Measures For Doctors

Posted : September 10, 2024 at 12:54 pm IST by ManaTeluguMovies

Supreme Court Directs CBI On RG Kar Case, Orders Safety Measures For Doctors

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad