Advertisement

పవన్ క్లాస్ పీకింది నిజమేనా?

Posted : June 7, 2020 at 4:01 pm IST by ManaTeluguMovies

సినిమా రంగ వ్యవహారాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో మంత్రి తలసానితో కలిసి చర్చలు జరిపిన నేపథ్యంలో సీనియర్ హీరో బాలకృష్ణ క్యాజువల్ గా అయినా తీవ్ర మైన కామెంట్ చేయడం, దానిపై నాగబాబు వీరావేశంతో విడియో చేయడం తెలిసిందే. దానిపై బాలయ్య మళ్లీ రెస్పాండ్ కాకపోయినా, నాగబాబు వరుసగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ట్వీట్ లు వేయడం కూడా తెలిసిందే.

ఇలాంటి నేపథ్యంలో కమ్మ-కాపు సామాజిక వర్లాల మధ్య జనసేన పార్టీ ఐక్యత కోసం తెరవెనుక తెలుగుదేశం, జనసేన కృషి చేస్తున్నాయన్న వార్తలు వున్న నేపథ్యంలో నాగబాబు చేసిన వాఖ్యలు సంచలనం కలిగించాయి. అప్పటికీ తెలుగుదేశం శ్రేయోదాయక మీడియా నాగబాబు వాఖ్యలకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వకుండా టోన్ డౌన్ చేసింది. తెలుగుదేశం పార్టీ కూడా తమ మీద అన్ని విమర్శలు చేసినా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఏమి అన్నా ఇదంతా చినికి చినికి గాలివానగా మారతాయని ఆ పార్టీ భయపడినట్లు అర్థమైపోయింది.

ఇలాటి నేపథ్యంలో నాగబాబు కూడా పూర్తిగా మారిపోవడం విశేషం. ఆయన ఓ మీడియాతో ఈ విషయమై అస్సలు వివాదమే లేదన్నట్లు మాట్లాడారు.. బాలకృష్ణ కామెంట్ చేసారని తానేదో అన్నట్లు, ఆ తరువాత ఆయన మాట్లాడలేదు కాబట్టి, ఇక వివాదమే లేదని తాను భావిస్తున్నట్లు చెప్పుకువచ్చారు. నిజానికి మొదటి విడియోకి బాలయ్య స్పందించకున్నా, నాగబాబు రెచ్చిపోయి మరిన్ని ట్వీట్ లు వేసారు కదా?

”ఆయన ఆవేశపడి మాట్లాడారు. కోపంలో మాట్లాడారు. పెద్ద ఇంటెన్షన్ గా మాట్లాడారని నేను అనుకోవడం లేదు. పైగా ఇమ్మీడియట్ గా సర్దుకుపోయారు. ఇంతకన్నా ఆయన గురించి నేను మాట్లాడడం సరి కాదు’ అని నాగబాబు అన్నారు. ”నేను అలా అనకూడదు కరెక్ట్ కాదు అని సింపుల్ గా చెప్పాను అంతే…కామెంట్ చేయకూడదు అన్నాను తప్ప వేరు కాదు. .” అంతే కాదు. ఇక ఫర్ దర్ గా బాలకృష్ణ మీద మరే కామెంట్ చేయను, అని క్లారిటీగా వివరించారు.

నాగబాబు బాలయ్య మీద పెట్టిన విడయోకీ, ఆ తరువాత చేసిన ట్వీట్లకు, ఇప్పుడు ఈ సమాధానానికి ఏమైనా పొంతన వుందా? అందరూ సర్ది చెప్పారు. ఇష్యూ క్లోజ్డ్ అని నాగ్ బాబు సింపుల్ గా అనేసారు. అంటే దీన్ని బట్టి నాగబాబు పూర్తిగా వెనక్కు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. మరి ఇలా తగ్గిపోవడానికి కారణం ఏమై వుంటుంది? తెలుగుదేశం పార్టీ నుంచి రాయబారం నడిచే అవకాశం కానీ, దానికి నాగబాబు తలవొగ్గే విషయం కానీ జరిగేది కాదు. నాగబాబు మాట మార్చుకున్నారు, మనసు మార్చుకున్నారు అంటే దానికి ఇద్దరే కారణం అయి వుండాలి. అయితే అన్న చిరంజీవి లేదా తమ్ముడు పవన్ కళ్యాణ్.నచ్చ చెప్పడమో, మరోటో జరిగి వుండాలి.

ఇలాంటి నేపథ్యంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గట్టిగా నాగబాబుకు క్లాస్ పీకారనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. నాగబాబు జనసేనలో వుండడం వల్ల ఏకామెంట్ చేసినా, అది పార్టీ మీద, ఆంధ్ర రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుందని, పవన్ గట్టిగా క్లాసు పీకారని టాక్ వుంది. జగన్ ను ఢీకొనాలి అంటే తెలుగుదేశం-జనసేన పరోక్షంగానైనా కలిసి వుండాల్సిన అవసరం వుంది, అలా జరిగాలి అంటే కమ్మ-కాపు వర్గాల మధ్య ఎటువంటి పొరపచ్చాలు రాకూడదు. ఇవన్నీ వివరంగా క్లాసు పీకడంతోనే నాగబాబు వెనక్కు తగ్గి వుంటారన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో, ఇటుఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని, జనసేన పార్టీ కోసం మాత్రమే పని చేస్తానని కూడా నాగబాబు చెప్పడం విశేషం. ఎంపీ అభ్యర్థి3ా పోటీ చేసిన నాగాబాబు నాలుగేళ్ల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై వుంటుందో ఆయనకే తెలియాలి.


Advertisement

Recent Random Post:

Bigg Boss Telugu 8 | Day 80 – Promo 1 | ‘Save the T-shirt’ Challenge 💥| Nagarjuna

Posted : November 20, 2024 at 7:25 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad