Advertisement

ఫోటోటాక్ : మెగా పవన్ వారసుడికి అప్పుడే దండ పడింది

Posted : May 2, 2022 at 6:32 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో మెగా ఫ్యామిలీ హీరోలు చాలా మంది ఉన్నారు. చిరంజీవి దారిలో ఆయన ఫ్యామిలీ నుండి వచ్చిన పవన్.. చరణ్.. బన్నీ ఇలా పలువురు టాలీవుడ్ ను ఏలేస్తున్నారు. ఇండస్ట్రీకి మరికొంత మంది వారసులు కూడా రాబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ తనయుడు పదేళ్ల వయసు లో ఉన్నప్పటి నుండే ఇండస్ట్రీకి మరో మెగా వారసుడు వస్తాడంటూ అభిమానులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ విడి పోయి ఒంటరిగా పిల్లలతో జీవితం సాగిస్తున్నారు. ఆమె మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా ఆమె తో ఉంటున్న మెగా వారసుడు అకీరా గురించి మెగా ఫ్యాన్స్ లో ఎప్పుడు కూడా చర్చ జరుగుతూనే ఉంది.

ఇప్పుడు కాకుండా అకీరా ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా హీరోగా ఎంట్రీ ఇస్తాడు అంటూ అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. అకీరా ఫోటో ఏదైనా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ షేర్ చేసినా లేదంటే పవన్ తో కలిసి ఉన్నా కూడా అవి తెగ షేర్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అకీరా హీరో కాకుండానే సోషల్ మీడియా ద్వారా స్టార్ అయ్యాడు.

తాజాగా ఆచార్య సందర్బంగానా లేదా మరేంటో కాని అకీరా ఫోటోకు ఇలా దండలు పడిపోయాయి. ఈ స్థాయిలో దండలు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పడుతాయి. ఇంకా హీరోగా ఒక్క సినిమా కూడా చేయకుండానే.. అది కూడా కనీసం ఆ వయసు కూడా రాకుండానే ఇలా కటౌట్ కు దండలు వేయించుకున్నాడు అంటే అకీరా భవిష్యత్తు పవర్ స్టార్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.

పవన్ కళ్యాన్ ఇప్పటికే అకీరా ఆసక్తి మేరకు డాన్స్ లు మరియు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో లు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చిన విషయం తెల్సిందే. అవన్నీ నేర్చుకుంటున్నాడు కనుక ఖచ్చితంగా అకీరా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ఖాయం అనిపిస్తుంది. అయితే 20 ఏళ్లు దాటిన తర్వాత అకీరా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం అకీరా వయసు 18 ఏళ్లు. ఆయన ఇండస్ట్రీ లో అడుగు పెట్టడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ హంగామా కొనసాగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ తనయుడిగా మెగా ఫ్యామిలీ వారసుడిగా అకీరాకు అద్బుతమైన ఎంట్రీ దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

గుంటూరు జిల్లాలో మ్యాజిక్ ఫిగర్ పై భారీగా బెట్టింగ్.. | Special Report On Betting In Guntur

Posted : May 22, 2024 at 1:16 pm IST by ManaTeluguMovies

గుంటూరు జిల్లాలో మ్యాజిక్ ఫిగర్ పై భారీగా బెట్టింగ్.. | Special Report On Betting In Guntur

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement