వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి మధ్యా పోలికల ప్రస్తావన సోషల్ మీడియాలో వస్తోంది.
ఒకరిది రాజకీయ వారసత్వం. తన తండ్రి ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి, తన తండ్రి రాజకీయాల్లో వున్నప్పుడే తానూ రాజకీయ రంగ ప్రవేశం చేశాను కాబట్టి.. తన తండ్రి తర్వాత తనకే ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదృష్టమో, దురదృష్టమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు కూడా.!
పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ఆయన లెక్క వేరు. సినిమాల్లో సంపాదించిన డబ్బు, పేరు ప్రఖ్యాతులు.. వీటన్నిటినుంచి పుట్టిన ఆలోచన, జనానికి సేవ చేయాలని. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని.!
రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించాలని చాలామంది అనుకుంటారు. తాతలో, తండ్రులో.. వారి పేరు చెప్పుకుని, వారి పదవుల్ని అడ్డంపెట్టుకుని కోట్లు గడించి, అంతకు మించిన సంపాదన రాజకీయాల్లో వస్తుందనే యావతో రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరు.
కానీ, సినీ రంగంలో సంపాదించుకున్న డబ్బు, పేరు ప్రఖ్యాతులు.. అశేష ప్రజానీకం పంచే అభిమానం.. వీటన్నిటినుంచీ ప్రజలకు సేవ చేయాలని కొంతమంది అనుకుంటారు.. ఆ లిస్టులో స్వర్గీయ ఎన్టీయార్.. తదితరులుంటారు.
చిరంజీవి కూడా అలాగే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థలో ఆయన ఇమడలేకపోయారు. ‘బురద’ అని తెలిసీ, పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లోకి దిగారు. ‘ఏం చేశామో చెప్పగల ధైర్యం చంద్రబాబు దత్త పుత్రుడికి వుందా..’ అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
సినిమాల్లో తాను సంపాదించిన సంపాదనలోంచి దాదాపు 30 కోట్ల రూపాయల్ని ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంచుతున్నారు పవన్ కళ్యాణ్. ఏదీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన జేబుల్లోంచి రూపాయి అయినా తీసి జనానికి ఖర్చు పెట్టారేమో చెప్పమనండి చూద్దాం.. అన్నది జనసైనికుల ప్రశ్న.
ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తూ, జగనన్న విద్యా దీవెన, జగనన్న చిక్కీ.. అంటూ సొంత పేర్లు పెట్టుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, తన వ్యక్తిగత సంపాదనను ప్రజలకు పంచి పెడుతున్న పవన్ కళ్యాణ్‌కీ అస్సలు పొంతన లేదు.