దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యావ్యవస్థ మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన తెలుగు రాష్ట్రాలు డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఏపీలో వైరస్ ఉదృతి విపరీతంగా ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు. ఒక వేళ పరీక్షలు ఇప్పుడు నిర్వహించకుండా ఇంకా ఎప్పటికో నిర్వహిస్తే విద్యార్థులు ఒక సంవత్సరం వృదా కావాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. తాజాగా ఏపీ విద్యార్థి సంఘం నాయకులు మరియు పలువురు విద్యార్థులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ విషయమై స్పందించాల్సిందిగా కోరుతూ కలవడం జరిగింది.
డిగ్రీ మరియు ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విధ్య అభ్యసిస్తున్న విద్యార్థుల విషయమై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండా పాస్ అయినట్లుగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశాడు. డిగ్రీ మరియు ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్న వారు చాలా మంది క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నారు. వారు తమ డిగ్రీ పట్టా పట్టుకుని ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సిన టైం వచ్చింది. కాని ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించలేదు. మళ్లీ ఎప్పటికి పరీక్షలు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కనుక వెంటనే వారు పాస్ అయిట్లుగా ప్రకటించి వారికి ఉతీర్ణత అయినట్లుగా సర్టిఫికెట్ ను ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేసి కోరడం జరిగింది. మరి ప్రభుత్వం పవన్ విజ్ఞప్తికి ఎలా స్పందిస్తుందో చూడాలి.