ఆర్జీవీ పవర్ స్టార్ అంటూ చేస్తున్న హడావుడి ఇంతా అంతా కాదు. పైగా అందులో హీరో కు పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే ట్విట్టర్ అక్కౌంట్ క్రియేట్ చేయడం విశేషం. గతంలో వంగవీటి, కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాల టైమ్ లో మాదిరిగానే ఇప్పుడు కూడా నానా హడావుడి చేస్తున్నారు. కానీ ఈ సారి ఎందుకో ఎక్కడా ఎటువంటి ప్రతిస్పందన రావడం లేదు.
వర్మ ట్విట్ల కింద ఫ్యాన్స్ నో మరొకరో కామెంట్ లు చేయడం మినహా, మరెవరు ఈ సినిమాను సీరియస్ గా తీసుకోవడం లేదు. వర్మ హడావుడి, ఆ తరువాత అంతా బుస్ మనడం జనాలకు అర్థం అయిపోయింది. అందుకే ఎవ్వరూ పవర్ స్టార్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. రెండున్నర గంటల సినిమా తీసినపుడే ఏమీ లేదు. అలాంటిది ముఫై, నలభై నిమషాల్లో వర్మ చూపించే సంచలనం ఏమీ వుండదని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
ఆరంభంలో ఇండస్ట్రీ జనాలు ఒకరిద్దరు ఈ సినిమా విషయం మీద ఎంక్వయిరీ చేయడం, దాంతో శ్రేయాస్ ఇటి సంస్థ దాని పంపిణీ బాధ్యతల నుంచి తప్పుకోవడం జరిగిపోయింది. ఇక ఆపై ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇదిలా వుంటే పవన్ సన్నిహితులు కొందరు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారట. కానీ పవన్ అస్సలు ఆసక్తి కనబర్చలేదని, పట్టించుకోలేదని తెలుస్తోంది.
ఎప్పుడయితే పవన్ కానీ మెగా క్యాంప్ కానీ ఈ సినిమాను పట్టించుకోకుండా లైట్ తీస్కున్నాయో, మిగిలిన ఇండస్ట్రీ వర్గాలు కూడా వదిలేసాయి. వర్మ సినిమా గురించి కెలకడం కన్నా, వదిలేయడం మంచిది అన్న ఆలోచనలో మెగా వర్గాలు, ఫ్యాన్స్ వున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఏ ఒక్కరు కూడా అస్సలు స్పందించడం లేదు. అప్పటికీ వర్మ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ, వాళ్లను బరిలోకి లాగాలనే చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఎక్కడా అస్సలు రియాక్షన్ లేదు.