Advertisement

పవన్ కొడుక్కి ఈ క్రేజేంటి బాబోయ్

Posted : April 8, 2020 at 11:09 pm IST by ManaTeluguMovies

లుగు సినిమా చరిత్రలో క్రేజ్ అనే మాట తీసుకుంటే.. ముందు గుర్తుచ్చే పేర్లలో పవన్ కళ్యాణ్‌ది ఒకటి. అన్న చిరంజీవి వారసత్వాన్నందుకుని సినిమాల్లో అడుగుపెట్టినప్పటికీ.. ఆయన నీడ నుంచి త్వరగానే బయటికి వచ్చేశాడు పవన్. కెరీర్లో కొన్నేళ్లు గడిచేసరికి తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీ ఏర్పరుచుకుని.. సొంత ఫ్యాన్ బేస్‌ను పెంచుకుని పవర్ స్టార్‌గా ఎదిగాడు. ఒక దశలో పదేళ్ల పాటు హిట్టు లేకపోయినా సరే.. పవన్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.

‘గబ్బర్ సింగ్’తో బ్యాంగ్ బ్యాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు పవన్. ఇక పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. రీఎంట్రీ కోసం ‘పింక్’ లాంటి సోషల్ కాజ్ ఉన్న మూవీ ఎంచుకున్నా సరే.. ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు రెస్పాన్స్ ఎలా ఉందో.. పవన్ క్రేజ్ ఎలాంటిదో అందరూ చూశారు. పవన్ తాలూకు ప్రభావం ఆయన కొడుకు అకీరా నందన్ మీద కూడా ఉంటుందనడంలో సందేహం లేదు.

అకీరా తండ్రితో ఉన్నది చాలా తక్కువ. సినీ వాతావరణంలో పెరగలేదు. ఇక్కడి హడావుడికి దూరంగా చాలా ఏళ్లు పుణెలో పెరిగాడు. యుక్త వయసు వచ్చాక కూడా తల్లి రేణు దేశాయ్‌తోనే ఉంటున్నాడు. అయినా సరే.. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా అకీరాకు సోషల్ మీడియాలో కనిపిస్తున్న క్రేజ్ చూస్తే వామ్మో అనిపించకమానదు. పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద బోలెడన్ని ఎడిట్స్ చేశారు ఫ్యాన్స్. బర్త్ డే కామన్ డీపీ సహా ఎన్నో ఎడిట్స్ కనిపిస్తున్నాయి. వేల కొద్దీ ట్వీట్లు పడుతున్నాయి.

సినీ రంగం నుంచి అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయిలో ట్రెండ్ అవుతున్న పేరు అకీరాదే. ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టకముందే అకీరాకు సోషల్ మీడియాలో ఇంత క్రేజ్ కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ అకీరాకు సినిమాల్లో నటించే ఉద్దేశం ఉందో లేదో కానీ.. పవన్ ఫ్యాన్స్ అయితే అతడికి రెడ్ కార్పెట్ వేసి వెల్కం చెప్పడానికి.. పవన్‌ మీద చూపించే అభిమానాన్ని అతడి మీదా చూపించడానికి రెడీ అయిపోయినట్లున్నారు.


Advertisement

Recent Random Post:

సీఎం జగన్ని సలహా అడిగిన యువతి l CM Jagan Interacting with Social Media Wing

Posted : April 23, 2024 at 7:29 pm IST by ManaTeluguMovies

సీఎం జగన్ని సలహా అడిగిన యువతి l CM Jagan Interacting with Social Media Wing

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement