Advertisement

నందమూరి హీరోకి డై హార్డ్ ఫ్యాన్ గా మెగా హీరో..!

Posted : August 9, 2021 at 4:09 pm IST by ManaTeluguMovies

మెగా బ్రాండ్ – అభిమానులను నమ్ముకొని హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు పవన్ తేజ్ కొణిదెల. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి దగ్గరి బంధువైన పవన్ తేజ్.. ‘ఖైదీ నెం.150’ ‘రంగస్థలం’ ‘వాల్మీకి’ వంటి మెగా హీరోల సినిమాల్లో నటించాడు. “ఈ కథలో పాత్రలు కల్పితం” అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఫస్ట్ సినిమాతో నిరాశపరిచాడు. అయితే ఇప్పుడు రెండో సినిమా కోసం కొణిదెల హీరో నందమూరి కాంపౌండ్ ని నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.

పవన్ తేజ్ తన పుట్టినరోజు పురస్కరించుకుని హీరోగా సెకండ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి శ్రీనివాస్ శ్రీరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ టాకీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిగా పవన్ కనిపించనున్నాడు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో థియేటర్ వద్ద ఎన్టీఆర్ కటౌట్ ముందు మెగా హీరో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇది సోషల్ మీడియాలో మెగా నందమూరి ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోడానికి దారి తీసింది.

ఫస్ట్ సినిమా ప్లాప్ అవడంతో మెగా హీరో ఎన్టీఆర్ కు డై హార్డ్ ఫ్యాన్ గా నటిస్తున్నాడని.. ఈసారి హిట్ పక్కా అని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ముందు నందమూరి హీరోలు సక్సెస్ అందుకునే మార్గం చూసుకోమనండి అని మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ తేజ్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ”ఎన్టీఆర్ ఫ్యాన్ గా నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆయన పట్ల నాకు ఉన్న నిజమైన అభిమానం నన్ను ఈ ఆసక్తికరమైన పాత్రను పోషించేలా చేసింది. ఇది మెగా మరియు తారక్ అన్న అభిమానులను కూడా ఆకట్టుకునే ఛాలెంజింగ్ రోల్. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా.. లోపల ఒరిజినల్ అలానే ఉంది” అని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ ను అభిమానిస్తా అని చెప్తూనే పరోక్షంగా నేను మెగా ఫ్యామిలీ అని పవన్ చెబుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే పవన్ తేజ్ తనకు తాను మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోనని చెప్పుకుంటున్నా.. ఫస్ట్ సినిమాకు మెగా హీరోల నుంచి మద్దతు దక్కలేదనే చెప్పాలి. మెగా బ్రదర్ నాగబాబు టీజర్ ని లాంచ్ చేయడం మినహా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరి అండదండలు పవన్ కు దక్కినట్లు అనిపించలేదు. పవన్ తేజ్ మాత్రం మెగా అభిమానుల మెప్పుపొందడానికి చాలానే ట్రై చేసాడు. మరి ఇప్పుడు మెగా – నందమూరి ఫ్యాన్స్ కలిసి కొణిదెల హీరోకి హిట్ ఇస్తారేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 5th July 2024

Posted : July 5, 2024 at 10:13 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 5th July 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement