Advertisement

పెద్దిరెడ్డి వర్సెస్ ఎస్ఈసీ: కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.!

Posted : February 8, 2021 at 12:37 pm IST by ManaTeluguMovies

ఎన్నికల అంశాలపై మీడియాతో మాట్లాడకూడదంటూ హైకోర్టు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్పష్టం చేసింది. అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు ఇంట్లోనే వుంచాలనీ, ఆయన మీడియాతో సైతం మాట్లాడేందుకు అనుమతించరాదని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు చెల్లవని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో, ఇరు పక్షాలకీ సమన్యాయం ఉన్నత న్యాయస్థానం చేసిందా.? అంటే, ఔననే చెప్పాలేమో. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ‘వ్యక్తిగత పంచాయితీ’ అన్నట్టు మారిపోయింది, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వ్యవహారం. ఎస్ఈసీ నిమ్మగడ్డపై పెద్దిరెడ్డి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

మరోపక్క, పెద్దిరెడ్డిపై ఆధిపత్యం సంపాదించేందుకోసం తన అధికారాన్ని వీలైనంత ఎక్కువగా (అవసరానికి మించి) వాడేస్తున్నారు ఎస్ఈసీ. ఆ విషయం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమయిపోయింది. ఓ మంత్రిని ఇంటికే పరిమితం చేయాలని ఎస్ఈసీ ఆదేశాలివ్వడమేంటి.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు పెద్దిరెడ్డి విషయంలో ఎస్ఈసీ ఇటీవల జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో. అదే సమయంలో, ‘ఈయనసలు మంత్రేనా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని పట్టుకుని మ్యాడ్ ఫెలో.. అని ఎలా అనగలిగారు.?’ అని కూడా జనం ఆశ్చర్యపోయారు. పెద్దిరెడ్డి అంటే రాజకీయ నాయకుడు.. ఆయనకు ఉచ్ఛం నీఛం.. అనే అంశాల పట్ల పెద్దగా బేధాభిప్రాయాలు వుండేమో.. అని అంటోన్న రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డను పలు అంశాలపై సమర్థిస్తూనే, కొన్ని అంశాల్లో తప్పుపడుతున్నారు. పంచాయితీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యత మేరకు అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవాలు చేయించలేకపోయానన్న ఫ్రస్టేషన్ బహుశా మంత్రి పెద్దిరెడ్డికి వుండొచ్చుగాక.

అయితే మాత్రం, తన స్థాయిని మరిచి.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఆయనెలా చేస్తారు.? పైగా, అధికారుల్ని బెదిరించడమా.? ‘బ్లాక్ లిస్టులో పెడతాం’ అని అధికారులకు అల్టిమేటం జారీ చేస్తే ఎలా.? ఇప్పుడేమో, హైకోర్టు ఆదేశాలతో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి పెద్దిరెడ్డి ఎక్కడా ఏమీ మాట్లడటానికి వీల్లేకుండా పోయింది. ఎన్నికల విధుల నిర్వహణలో బిజీగా వున్న ఎస్ఈసీ నిమ్మగడ్డను సైతం పెద్దిరెడ్డి ఏమీ అనడానికి వీలుండకపోవచ్చు. ఆ లెక్కన, నిమ్మగడ్డకీ కొంత ఊరట హైకోర్టలో లభించిందనే అనుకోవాలేమో.


Advertisement

Recent Random Post:

Love Reddy (Kannada) Trailer | Anjan Ramachendra, Shravani | Smaran Reddy | Prince Henry

Posted : November 11, 2024 at 2:08 pm IST by ManaTeluguMovies

Love Reddy (Kannada) Trailer | Anjan Ramachendra, Shravani | Smaran Reddy | Prince Henry

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad