Advertisement

బులుగు రాజకీయం: చిరంజీవిని అవమానించి.. బాలయ్యపై ప్రేమ కురిపించి.!

Posted : February 25, 2022 at 10:13 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమ తరఫున, పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదే పదే విజ్ఞప్తులు చేస్తే, వాటి పట్ల ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. ఆ ప్రయోజనాల వల్ల చిరంజీవి వ్యక్తిగతంగా లాభపడేది ఏమీ వుండదని, ‘భీమ్లానాయక్’ ఉదంతంతో తేటతెల్లమైపోయింది.

అయినా, చిరంజీవి పరిశ్రమ తరఫున ‘బాధ్యత’ తీసుకున్నారు. ఆ బాధ్యతని కూడా గేలి చేసే కుహనా మేధావులు సినీ, రాజకీయ వర్గాల్లో వున్నారనుకోండి.. అది వేరే సంగతి. చిరంజీవి చేతులు జోడించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘సాయం’ కోరారు.. పరిశ్రమ కోసం. మహేష్, ప్రభాస్ తదితరులూ ఈ భేటీలో పాల్గొన్నారు.

అలా చిరంజీవిని తన దగ్గరకు రప్పించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిత్రంగా నందమూరి బాలకృష్ణను మాత్రం రప్పించుకోలేదు. ‘అఖండ’ సినిమాకి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆ చిత్ర నిర్మాతలు సంప్రదింపులు జరిపారట. దీనికి ఓ వైసీపీ ఎమ్మెల్యే మద్యవర్తిత్వం వహించారట. మంత్రి పేర్ని నాని స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అయితే, ‘అఖండ’కి ఇచ్చిన వెసులుబాట్లు ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు.

బాలయ్య స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పారట. కానీ, ‘ఆయన్ని అగౌరవ పరిచినట్లవుతుంది.. ఆయనకు ఏం కావాలో అవి చేసి పెట్టండి..’ అని సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి సూచించారట. అంటే, తెరవెనుకాల ఏదో ‘సాయం’ బాలయ్య ‘అఖండ’ సినిమాకి అందినట్టే కదా.?

బాలకృష్ణ విషయంలో చూపిన ఈ అభిమానం, ప్రేమ, గౌరవం.. చిరంజీవి సహా మహేష్, ప్రభాస్ తదితరుల విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు చూపలేకపోయారట.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

నిర్మాతలు తమ తమ సినిమాల విషయమై, మద్యవర్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపితే.. అది గౌరవ ప్రదమా.? అది తెరచాటు వ్యవహారం కదా.! అన్న ప్రశ్న తలెత్తుతోంది. పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ పెద్దల ‘వింత చూపు’ ఇప్పుడందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.


Advertisement

Recent Random Post:

పవన్ కల్యాణ్ హోంమంత్రి ఐతే ఏం జరుగుతుంది? | Ambati Rambabu

Posted : November 6, 2024 at 1:19 pm IST by ManaTeluguMovies

పవన్ కల్యాణ్ హోంమంత్రి ఐతే ఏం జరుగుతుంది? | Ambati Rambabu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad