Advertisement

లంగావోణీలో నీలాంబరి తళుకులు

Posted : April 28, 2022 at 11:26 pm IST by ManaTeluguMovies

ముంబై బ్యూటీ పూజాహెగ్డే ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు నీలాంబరి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఆ పాత్ర లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. సంప్రదాయ లంగావోణీ కట్టుబొట్టులో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకూ వెస్ర్టన్ లుక్స్ లో ఆకట్టుకున్న బుట్టబొమ్మ తొలిసారి ట్రెడీషనల్ గాళ్ పాత్రలో కనిపిస్తుంది.

నీలాంబరి పాత్ర పరిచయంతోనే ఆ రోల్ ఎలా ఉంటుందన్నది క్లారిటీ వచ్చింది. పైగా కొరటాల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కథలో ఆ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం కొరటాల ప్రత్యేకత. ఆ రకంగా చూసుకుంటే నీలాంబరి పాత్రకు ‘ఆచార్య’లో చాలా స్పెషాల్టీ ఉంటుందని అంచనా వేయోచ్చు.

తాజా లీక్ తో నీలాంబరి మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. పూజాహెగ్డే ‘ఆచార్య’ సెట్స్ లో లంగావోణీ ధరించి ఎద్దు పక్కన నుంచుని స్నాప్ దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో పూజాహెగ్డే రెండు జడలు వేసుకుంది.

లంగావోణీలుక్ లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ ఎద్దు నీలంబరి ప్రెండ్ అట. ఈ ఫోటో చూపరులను ఆకట్టుకుంటుంది. బుట్టబొమ్మ లంగావోణీలోనూ ఎంతో ఆదంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక పూజాహెగ్డే సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సరసన ‘సిర్కస్’ లో నటిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా మరో రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసినట్లు సమాచారం. తెలుగులో సూపర్ స్టార్ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో ఈ భామనే హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే ‘ఎఫ్ -3’ లో ఐటం పాటలోనూ నటిస్తోంది.

ఇటీవలే పూజాహెగ్డే నటించిన రెండు సినిమాలు ‘రాధేశ్యామ్’..’బీస్ట్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ప్రభావం పూజాపై పడుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే అమ్మడు అప్పటికే రెండు..మూడు చిత్రాల్లో లాక్ అవ్వడం కలిసొచ్చిన అంశంగా తెలుస్తుంది.


Advertisement

Recent Random Post:

AP Election Counting Process Will Start By 8AM Tomorrow

Posted : June 3, 2024 at 5:23 pm IST by ManaTeluguMovies

AP Election Counting Process Will Start By 8AM Tomorrow

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement