Advertisement

సమంతకు చిరు ఝలక్.. ఇది అస్సలు ఊహించలేదుగా!?

Posted : April 9, 2022 at 12:30 pm IST by ManaTeluguMovies

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలను టేకప్ చేసుకుంటూ పోతోంది. ఈమె నటిస్తున్న చిత్రాల్లో ‘యశోద’ ఒకటి. శ్రీదేవి మూవీ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. హరీష్ శంకర్ హరీష్ నారాయణ్లు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. ఇందులో సమంత డిఫరెంట్ రోల్లో అలరించబోతోంది.

దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే సరిగ్గా అదే రోజు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ విడుదలవుతుంది.

అలాగే అమీర్ ఖాన్ నాగ చైతన్య కలిసి చేసిన హిందీ మూవీ ‘లాల్ సింగ్ చద్ధా’ ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు ఎప్పుడో అనౌన్స్ చేశారు. దీంతో సమంత కావాలనే అక్కినేని అన్నదమ్ములకు పోటీగా దిగుతోందనే ప్రచారం మొదలైంది.

అయితే ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సమంతకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేడీ సూపర్ స్టార్ నయనతార సత్యదేవ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

పొలిటికల్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే డబ్బై శాతం షూటింగ్ను పూర్తి చేసుకుంది. అయితే మిగిలిన పార్ట్ను కూడా త్వరత్వరగా కంప్లీట్ చేసి ఆగస్ట్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో.. ఆ దిశగా సన్నాహాలు మొదలుపెట్టిందట టీమ్.

దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్త సోషల్ మీడియాలో మాత్రం జోరుగా వైరల్ అవుతోంది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే.. సమంతకు బిగ్ షాక్ తగిలినట్టే అవుతుంది. ఎందుకుంటే చిరు సినిమా విడుదలైతే.. యశోదపై భారీ ఎఫెక్ట్ పడటం ఖాయం. కంటెంట్ ఎంత బాగున్నా.. బాక్సాఫీస్ క్లాషెస్ తప్పవు. మరి చిరు ఎంట్రీ ఇస్తే.. సమంత వెనక్కి తగ్గుతుందా..? లేదా ఆయనతో పోటీకి సిద్ధం అవుతుందా..? అన్నది చూడాలి.


Advertisement

Recent Random Post:

Hydra : Demolition of Illegal Constructions in Ameenpur and Kukatpally |

Posted : September 23, 2024 at 12:54 pm IST by ManaTeluguMovies

Hydra : Demolition of Illegal Constructions in Ameenpur and Kukatpally |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad