మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21వ చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. సినిమా అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక సినిమా గురించిన చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ విషయం యూనిట్ సభ్యుల నుండి కన్ఫర్మ్ కాకున్నా కూడా అదే నిజం అయితే ఎంత బాగుండు అనుకుంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.
ఇంతకు విషయం ఏంటీ అంటే.. నాగ్ అశ్విన్ రూపొందించబోతున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. బాహుబలి చిత్రంలో ప్రభాస్ తండ్రి కొడుకుల పాత్రలో నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రంలో కలిసి నటించబోతున్నారు. రికార్డు స్థాయి బడ్జెట్ తో బాహుబలిని బీట్ చేసే టార్గెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నాడట.
హాలీవుడ్ టెక్నీషియన్స్ మరియు బాలీవుడ్ నటీనటులు ఈ చిత్రం కోసం పని చేయబోతున్నారు. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ఈ చిత్రం తర్వాత ప్రపంచ స్థాయికి చేరుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉండటంతో హాలీవుడ్ లో విడుదలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ప్రారంభించి 2022లో చివర్లో సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యంలో నాగ్ అశ్విన్ ఉన్నాడట.