Advertisement

ఎక్స్ క్లూజివ్: ప్రభాస్‌ 21కి దీపికను తీసుకోవడానికి కారణం ఇదే

Posted : July 20, 2020 at 8:25 pm IST by ManaTeluguMovies

ప్రభాస్‌ 21వ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది. షూటింగ్‌ కు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ హీరోయిన్‌ ఎవరు అనే విషయాన్ని రివీల్‌ చేసి అందరిని సర్‌ ప్రైజ్‌ చేశాడు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ చిత్రంలో దీపిక పదుకునే నటిస్తున్న నేపథ్యంలో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడీగా అంత పారితోషికం ఇచ్చి దీపిక పదుకునేను ఎంపిక చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు డాన్స్‌ కు సంబంధం ఉంటుంది. డాన్సర్‌ గా హీరోయిన్‌ కనిపించాల్సి ఉంటుంది. బాలీవుడ్‌ లో ఉన్న ప్రస్తుత హీరోయిన్స్‌ లో మంచి డాన్సర్‌ గా దీపిక పదుకునేకు పేరు ఉంది. అందుకే ఆమెను ఈ చిత్రంలో నటింపజేయాలని నాగ్‌ అశ్విన్‌ అనుకున్నాడు. అందుకు కాస్త పారితోషికం ఎక్కువ అయినా పర్వాలేదనుకున్నాడు.

ప్రభాస్‌ తో నాగ్‌ అశ్విన్‌ రూపొందించబోతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలోని హీరోయిన్‌ పాత్రకు దీపిక పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని దర్శకుడు భావిస్తున్నాడు. మహానటి చిత్రంకు కీర్తి సురేష్‌ ను తీసుకున్న సమయంలో కొందరు పెదవి విరిచారు. కాని నాగ్‌ అశ్విన్‌ నిజంగా సావిత్రిని తీసుకుని వచ్చి నటింపజేశాడా అన్నట్లుగా మాయ చేశాడు. పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో నాగ్‌ అశ్విన్‌ తర్వాతే ఎవరైనా అనేది ఆయన గత చిత్రాల ఎంపికను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభాస్‌ 21లోని హీరోయిన్‌ పాత్రకు కూడా దీపిక నూటికి రెండు వందల శాతం న్యాయం చేస్తుందని అంతా నమ్ముతున్నారు.


Advertisement

Recent Random Post:

కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత | Congress Senior Leader D Srinivas Passed Away

Posted : June 29, 2024 at 12:27 pm IST by ManaTeluguMovies

కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత | Congress Senior Leader D Srinivas Passed Away

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement