రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా ఎగ్జైటింగ్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. రాధే శ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు. ఇక నిన్న ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ అందరికీ సర్ప్రైజింగ్ గా అనిపించింది. అదే ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనుండడం.
అయితే ఈ అప్డేట్ వచ్చినప్పుడు అందరూ ఇందులో అమితాబ్ ది కామియో పాత్ర అనే అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. అందరూ అనుకుంటున్నట్లు ఇది కామియో పాత్ర కాదని, చాలా ముఖ్యమైన పాత్రనే చేస్తున్నాడని తెలిసింది. దాదాపు 40 రోజుల పాటు అమితాబ్ ఈ సినిమా కోసం పనిచేయనున్నాడట. ఈ చిత్రం తన కెరీర్ కు చాలా స్పెషల్ చిత్రం అవుతుందని తెలిపాడు అమితాబ్. దీన్ని బట్టి బిగ్ బి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో అర్ధం చేసుకోవచ్చు.
ఏదేమైనా ప్రభాస్, దీపికా, అమితాబ్ ల కాంబినేషన్ వింటుంటేనే ఇలా ఉంటే ఇక పెద్ద తెరపై ఎలా ఉంటుందో చూడాలి.