Advertisement

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు!

Posted : March 21, 2021 at 8:58 pm IST by ManaTeluguMovies

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని మోషన్‌ క్యాప్చర్‌ షూట్‌ మొదలైంది. ఇది ఈ విజువల్ వండర్ లో అతి కీలకంగా తెరకెక్కిస్తున్నారు. కేవలం ఈ పార్ట్ కోసమే రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారట మేకర్స్‌.
ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్ గా ఉంటుంది అని మేకర్స్‌ ప్రకటించారు. ఇక ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌తో షూటింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయ్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌లో ‘సలార్‌’ షెడ్యూల్‌ పూర్తి చేసిన ప్రభాస్‌, ‘ఆదిపురుష్‌’ కోసం ముంబయ్‌ వెళ్లారు. అక్కడ ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక రాముడి పాత్ర కోసం ప్రభాస్‌ భారీ కసరత్తు చేస్తున్నాడట. పాత్రకు తగ్గట్టుగా కొంచెం స్లిమ్‌ లుక్‌లో కనబడనున్నారు. అందుకోసం ముంబయ్‌లో రోజుకి ఉదయం, సాయంత్రం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. కొన్ని కిలోల బరువు తగ్గించే పని మీద ఉన్నారట. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.


Advertisement

Recent Random Post:

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు | Unexpected Developments in US Presidential Election

Posted : November 4, 2024 at 12:53 pm IST by ManaTeluguMovies

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు | Unexpected Developments in US Presidential Election

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad