Advertisement

నన్ను చూసి జనం విసుగెత్తిపోవాలనుకోను!- ప్రభాస్

Posted : March 2, 2022 at 11:51 pm IST by ManaTeluguMovies

ప్రభాస్ -పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రాధాకృష్ణ కుమార్ ఏకంగా ఐదేళ్లు పని చేశారంటే అర్థం చేసుకోవాలి. కరోనా క్రైసిస్ ఎంటరవ్వడం కూడా ఈ డిలేకి కారణమైంది. ఏది ఏమైనా ఒక క్లాసిక్ ని తెరకెక్కించి అందిస్తున్నామన్న ధీమా అతడికి ఉంది. ఫిక్షనల్ లవ్ స్టోరి .. విధిరాత నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించనుందని సమాచారం. మార్చి 11న మూవీ విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రభాస్ తన జీవితంలో ఏ జ్యోతిష్యుడిని సంప్రదించలేదుట. “నేను విధిని నమ్ముతాను.. కానీ నేను ఏ జ్యోతిష్కుడికి నా చేతిని చూపించలేదు. నాకు హస్తసాముద్రికుడి పాత్రను ఆఫర్ చేసినప్పుడు.. ఇది నేను ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించనిది కాబట్టి చాలా ఆసక్తికరంగా అనిపించింది“ అని ట్రైలర్ లాంచ్ సందర్భంగా అన్నారు.

యాక్షన్ స్టార్ గా పేరు తెచ్చుకోవడం గురించి మాట్లాడుతూ- “రాధే శ్యామ్ లో యాక్షన్ ఉంది కానీ మనం చాలా డిషూమ్ డిషూమ్ చేస్తున్నట్లు కాదు. ఆదిపురుష్- సలార్ సహా దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా ఇతరచిత్రాలు కూడా యాక్షన్ వే. అయితే ప్రతి రెండు మూడు సినిమాల తరవాత ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేయాలనే ఆలోచన ఉంది. తెలుగు సినిమాలో కూడా యాక్షన్ హీరోగా స్టార్ట్ చేసాను కానీ డార్లింగ్ – మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి రొమాంటిక్ జానర్ సినిమాలు చేశాను. ప్రేక్షకులు నన్ను చూసి విసుగు చెందడం నాకు ఇష్టం లేదు..“ అని ప్రభాస్ అన్నారు.

ప్రాంతీయ సినిమాల పురోగతి గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. “హాలీవుడ్ లో సినీనిర్మాణానికి ప్రత్యేకించి ఒక భాష ఉంది. చైనీస్ లేదా కొరియన్ చిత్రాల విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది. కానీ భారతదేశంలో అనేక భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

RRR- రాధే శ్యామ్ లేదా నా మునుపటి చిత్రం బాహుబలి అనేక కొత్త విండోలను డోర్స్ ని తెరిచాయి. మేం వీటితో ప్రయత్నించాం. ప్రయోగాలు చేస్తూ భారతీయ ప్రేక్షకులకు చేరువ అవుతున్నాము. మన సినిమాలను భారతీయ సినిమాలా చూడటం మొదలుపెట్టాం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా అవతరించి ఒకే పరిశ్రమగా గుర్తింపు పొందుతాం“ అని ప్రభాస్ అన్నారు.

ప్రభాస్ అన్న మాటలో చాలా విశాలమైన అర్థం ఉంది. విశాల ధృక్పథం ఉంది. అతడి ప్రతి మాటా ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. నా ప్రాంతం నా సినిమా అని ఇరుకు మెంటాలిటీ ఎక్కడా అతడిలో కనిపించలేదు. ఇండియా మొత్తం నాది.. టాలీవుడ్ అంటే ఇండియా అని కూడా క్లారిటీగా ఈ ట్రైలర్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. నెమ్మదిగా హిందీవోళ్లు కూడా కలిపేసాడు. అద్గదీ డార్లింగ్ అంటే..!


Advertisement

Recent Random Post:

రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే నాపై వైసీపీ ముద్ర : Kalavapudi Siva Rama Raju

Posted : May 10, 2024 at 5:29 pm IST by ManaTeluguMovies

రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే నాపై వైసీపీ ముద్ర : Kalavapudi Siva Rama Raju

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement