బుల్లితెరపై తన నటనతో ఆకట్టుకున్న యువ నటి , అందగత్తె అయిన ప్రేక్షా మెహతా (25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఏమైందో తెలియదు కానీ ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గది నుంచి కూతురు ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో తలుపులు తెరిచి తండ్రి చూసి షాక్ అయ్యాడు.
కళ్ల ముందు ఉరికి వేలాడుతూ ప్రేక్షా కనిపించడంతో కన్నతండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ప్రేక్షా మెహతా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. “కలలు చనిపోవడమే మన జీవితంలో చెత్త విషయం” అని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇంతకూ ప్రేక్షకా మెహతా ఎలాంటి కలలు కనింది, వాటిని చంపుకోవాల్సినంత పెద్ద సమస్య ఏమొచ్చింది? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. షూటింగ్‌లు ఆగిపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైందా లేక మరేమైనా కారణాలున్నాయా అని తేలాల్సి ఉంది.
ప్రేక్షకా మెహతా క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ సీరియల్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచి అభిమానుల్ని సంపాదించుకు న్నారు. ఆమె మృతితో స్నేహితులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు.