డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం చేస్తున్న విజయ్ దేవరకొండ మూవీ కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. దాంతో పూర్తి నాలుగు నెలలుగా ఖాళీగానే ఉన్నాడు. మరో మూడు నాలుగు నెలల వరకు కూడా షూటింగ్‌ను పున: ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో పూరి తన ఖాళీ సమయాన్ని వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ రాసేందుకు కేటాయించాడట. పూరి స్క్రిప్ట్‌తో యంగ్ డైరెక్టర్ డైరెక్షన్‌లో వెబ్ సిరీస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
పూరి నిర్మాణ సంస్థ వ్యవహారాలను ఛార్మి చూసుకుంటుంది. తాజాగా ఆమె వెబ్ సిరీస్‌కు సంబంధించి హింట్ ఇచ్చింది. పూరి స్క్రిప్ట్ అందించడంతో పాటు తన బ్యానర్‌లోనే ఆ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నాడు. వీలుంటే ఆ వెబ్ సిరీస్‌కు తానే దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. దాదాపుగా 75 లక్షల బడ్జెట్‌తో వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు వెబ్ సిరీస్‌కు ఆ బడ్జెట్ చాలా ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా డబ్ చేసే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే పూరి నుండి వెబ్ సిరీస్ ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు దర్శకులు ఇప్పటికే వెబ్ సిరీస్‌లను మొదలు పెడుతున్న నేపథ్యంలో పూరి కూడా ఆదిశగా అడుగులు వేయడం శుభసూచకం అంటున్నారు.