Advertisement

ఆర్ఆర్ఆర్ విష‌యంలో ఆ హీరోయిన్ పేరు!

Posted : August 25, 2020 at 12:00 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంతో అనూహ్యంగా ఇబ్బందుల్లో ప‌డింది న‌టి అలియా భ‌ట్ కెరీర్. ఒక వైపు సుశాంత్ అభిమానులు అలియా తండ్రి మ‌హేష్ భ‌ట్ ను తీవ్రంగా దూషిస్తూ ఉన్నారు. మ‌రోవైపు బాలీవుడ్ లో నెపొటిజం కు పోస్ట‌ర్ గ‌ర్ల్ గా అలియాను చూపెడుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమె న‌టించిన సినిమాకు సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల అయిన ట్రైల‌ర్ కు డిస్ లైక్ లు తీవ్రంగా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ నుంచి కూడా అలియా భ‌ట్ ను త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం ఒక‌వైపు జ‌రుగుతూ ఉంది.

ఆమె వ‌ల్ల సినిమా మార్కెట్ కు న‌ష్టం జ‌రిగే ప‌క్షంలో త‌ప్పిస్తార‌నే టాక్ చాన్నాళ్ల నుంచినే వ‌స్తోంది. అయితే ఆ సినిమా టీమ్ అధికారికంగా అలాంటి విష‌యం ఏదీ ప్ర‌క‌టించ‌లేదు. అయితే అలియా స్థానంలో ప్రియాంక చోప్రాను ఎంపిక చేశార‌నే టాక్ కూడా సోష‌ల్ మీడియానే పుట్టించింది.

వాస్త‌వానికి ప్రియాంక ఔట్ డేటెడ్ హీరోయిన్. ఆమె ఇప్పుడు ఐరావ‌తం టైపు. త‌న‌కు హాలీవుడ్ లో కూడా గుర్తింపు వ‌చ్చిందంటూ ప్రియాంక భారీగా రెమ్యూన‌రేష‌న్ అడ‌గొచ్చు కానీ, ఇండియ‌న్ మార్కెట్ లో ప్రియాంక ప‌రిస్థితి ఏమంత గొప్ప‌గా లేదు. ఇలాంటి క్ర‌మంలో ప్రియాంక వంటి ముదురు భామ ఈ సినిమాకు ఎలాంటి ఆక‌ర్ష‌ణా కాక‌పోవ‌చ్చు.

అయితే అలియా స్థానాన్ని ప్రియాంక‌తో భ‌ర్తీ చేస్తున్నార‌నేది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మే అని స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం తెలుగును ప్రాక్టీస్ చేస్తోంద‌ట అలియాభ‌ట్.


Advertisement

Recent Random Post:

నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం: Pawan Kalyan Public Meeting at Railway Koduru | AP Elections 2024

Posted : April 25, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం: Pawan Kalyan Public Meeting at Railway Koduru | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement