Advertisement

రేపు పున్ను చెప్పబోతున్న విషయం ఏంటీ?

Posted : October 29, 2020 at 1:57 pm IST by ManaTeluguMovies

ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 తో మంచి గుర్తింపు దక్కించుకుంది. రాహుల్‌ తో ఈమె స్నేహం వల్ల ఇద్దరికి కూడా కలిసి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. షో చూసిన ఎవరు అయినా కూడా ఈమెకు రాహుల్‌ తో వ్యవహారం సాగిందని బలంగా అనుకుంటారు. కాని అలాంటిది ఏమీ లేదని ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. బిగ్‌ బాస్‌ తర్వాత పున్ను టీవీ షోలు మరియు సినిమాలతో బిజీ అయ్యింది. సోషల్‌ మీడియాలో తన డైలీ లైఫ్‌ మరియు ప్రాజెక్ట్‌ లకు సంబంధించి అప్‌ డేట్స ఇస్తూ వస్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక ఫొటోను షేర్‌ చేసి ఎట్టకేలకు ఇది జరుగుతోంది అంటూ కామెంట్ పెట్టింది.

ఆ ఫొటోలో పున్ను చేతికి డైమండ్‌ రింగ్‌ ఉంది. ఆ రింగ్‌ ఖచ్చితంగా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అయ్యి ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. దాంతో ఆమె అభిమానులు మరియు ఫాలోవర్స్‌ అంతా కూడా షాక్‌ అవుతున్నారు. నిజంగా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా.. మీరు చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నించారు. ప్లీజ్‌ రాహుల్‌ ను మీరు పెళ్లి చేసుకోండి మీ జోడి బాగుంటుంది అంటూ చాలా మంది పున్నకు కామెంట్‌ పెట్టారు. నెటిజన్స్‌ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా పున్ను అక్టోబర్‌ 30 వరకు వేచి ఉండు అంది.

అక్టోబర్‌ 30 అంటే రేపు పున్ను ఏం చెప్పబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు పున్ను తన పెళ్లి విషయమై ప్రకటిస్తుందా లేదంటే ఆ ఫొటో ఏదైనా సినిమా లేదా షో వెబ్‌ సిరీస్‌ కు సంబంధించింది అయ్యి ఉంటుందా అనుకుంటున్నారు. ఉయ్యాల జంపాల సినిమా నుండి మొదలుకుని ఇప్పటి వరకు చాలా వరకు ఈమె సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే హీరోయిన్‌ గా మంచి బ్రేక్‌ రాలేదు. ఇకపై హీరోయిన్‌ గా బ్రేక్‌ వస్తుందని కూడా అనుకోవడం లేదు. అందుకే పెళ్లి పీఠలు ఎక్కే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటున్నారు. రేపు పెళ్లి విషయమే పున్ను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Home Minister Anitha Reaction On Deputy CM Pawan Kalyan Comments

Posted : November 5, 2024 at 11:47 am IST by ManaTeluguMovies

Home Minister Anitha Reaction On Deputy CM Pawan Kalyan Comments

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad