డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ఈ లాక్ డౌన్ సమయంను అందరిలా కాకుండా ఉపయోగకరంగా మార్చుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మద్య కాలంలో ఎక్కువగా ముంబయిలోని తన ఆఫీస్ లోనే ఎక్కువగా గడిపిన ఆయన పలు కథలను సిద్దం చేశాడంటూ సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే ఆయన యూట్యూబ్ ద్వారా పూరీ మ్యూజింగ్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే కథలతో పాటు కొన్ని బౌండెడ్ స్క్రిప్ట్ లు కూడా రెడీ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రూపొందిస్తున్న ఫైటర్ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలకు సంబంధించిన స్ర్కిప్ట్ లను కూడా రెడీ చేశాడట. బాలయ్య.. రామ్ మరియు మహేష్ బాబు కోసం కథలు సిద్దం చేశాడని వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు మరో రెండు స్క్రిప్ట్ లు కూడా రెడీ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పూరి జగన్నాద్ ఈ సినిమాలను వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ రూపొందించే అవకాశం ఉంది.