Advertisement

పూరికి మరో పాన్ ఇండియా ఆఫర్

Posted : June 9, 2021 at 2:35 pm IST by ManaTeluguMovies

కరోనా వైరస్ మహమ్మారి మనుషులనే కాదు జంతువులని కూడా వదిలిపెట్టడం లేదు. తమిళనాడులో వన్యప్రాణులకు కూడా కరోనా సోకుతోంది. ఇటీవల చెన్నై వాండలూర్ జూలో 9 సింహాలకు కరోనా సోకగా ఓ సింహం కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తమిళనాడులోని ముదుమలై అభయారణ్యంలో 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ముదుమలై ఫారెస్ట్ లోని తెప్పక్కుడి క్యాంపు ఏరియాలో సంచరించే ఈ ఏనుగుల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు ఉత్తరప్రదేశ్ లోని ఇజ్జత్ నగర్ లో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు పంపారు.

కోయంబత్తూరు నీలగిరి జిల్లాల్లో 2 శిబిరాల్లోని ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి నమూనాలను ఉత్తరప్రదేశ్ పశు పరిశోధనా సంస్థకు పంపారు. గత కొద్దీ రోజులుగా నాలుగు ఏనుగుల ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో పరీక్షలు నిర్వహించామని వివరించారు. కాగా తాజాగా తమిళనాడులోని చెన్నై జూపార్కులో కరోనాతో సింహం మృతి చెందిన విషయం విదితమే.. అదే పార్కులో దానితోపాటు ఉన్న మరికొన్ని సింహాలకు కూడా కరోనా సోకింది. దీంతో ఏనుగులకు కూడా పరీక్షలు నిర్వహించారు అధికారులు. దీనిపై ముదుమలై అభయారణ్యం వెటర్నరీ నిపుణుడు డాక్టర్ కె.రాజేశ్ కుమార్ మాట్లాడుతూ నమూనాల సేకరణలో తమకు ఏనుగులు చాలావరకు సహకరించాయని తెలిపారు. మత్తు ఇవ్వకుండానే వాటి నుంచి నమూనాలు సేకరించామని అన్నారు. మత్తు ఇస్తే అది తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇది కేవలం పరిశీలన కోసమేనని ఏనుగుల్లో ఏ ఒక్కదానికీ అనుమానిత లక్షణాలు లేవని తెలిపారు.


Advertisement

Recent Random Post:

Tamil Film Actress Kasturi Controversial Comments on DMK

Posted : November 4, 2024 at 12:40 pm IST by ManaTeluguMovies

Tamil Film Actress Kasturi Controversial Comments on DMK

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad