సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలు అంటే కొన్ని నెలల గ్యాప్ లోనే పూర్తి చేసేస్తుంటాడు. కానీ తన కెరీర్లో తొలిసారి లైగర్ కోసం టైమ్ తీసుకుంటున్నాడు. కేవలం కోవిడ్ కారణంగానే లైగర్ విషయంలో జాప్యం జరగలేదు. పూరి జగన్నాథ్ లైగర్ ప్రొడక్షన్ కోసం చాలానే సమయం తీసుకుంటూ వస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో లైగర్ రూపొందుతోంది. కరణ్ జోహార్ కూడా నిర్మాణంలో భాగమయ్యాడు.
కానీ పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా అస్సలు ఫామ్ లో లేడు. ఇస్మార్ట్ శంకర్ సంగతి పక్కనపెడితే పూరి నుండి చాలానే ప్లాప్ సినిమాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన రొమాంటిక్ కు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు పూరి జగన్నాథ్.
రొమాంటిక్ చిత్రాన్ని చూసిన వారు పూరి జగన్నాథ్ ఫామ్ పై మరోసారి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ ను ఫ్లూక్ విజయంగా అనుమానిస్తూ లైగర్ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.