Advertisement

ప్రముఖ హాలీవుడ్ నటి బెడ్ కోసం పూరి తాపత్రయం

Posted : May 17, 2021 at 5:48 pm IST by ManaTeluguMovies

దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర విషయం గురించి రివీల్ చేసాడు. తాను ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకు వీరాభిమాని అట. అయితే ఆమె పడుకున్న హోటల్ బెడ్ కోసం పూరి ప్రయత్నించాడు అని చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే పూరి జగన్నాథ్ షూటింగ్ నిమిత్తం వెనిస్ కు వెళ్ళాడట.

అక్కడ మర్క్స్ స్క్వేర్ వద్ద హోటల్ డేనియల్ లో అప్పుడే ఏంజెలినా జోలీ చెకౌట్ చేసినట్లు పూరి తెలుసుకున్నాడు. టూరిస్ట్ సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె వెనిస్ కు వచ్చి ఆ హోటల్ లో దిగిందట. వెంటనే తనకు ఆ రూమ్ కావాలని కోరుకున్నాడు. ఏంజెలినా పడుకున్న బెడ్ మీద తాను కొద్దిసేపు కూర్చుని తన మేనేజర్ తో మాట్లాడాడట పూరి జగన్నాథ్. అది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

The Kalki Chronicles | Ep 1 Full Interview | Stars Speak | Amitabh, Kamal Haasan, Prabhas, Deepika

Posted : June 24, 2024 at 2:37 pm IST by ManaTeluguMovies

The Kalki Chronicles | Ep 1 Full Interview | Stars Speak | Amitabh, Kamal Haasan, Prabhas, Deepika

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement