Advertisement

పుష్ప కోసం ఏకంగా రోడ్లనే వేసేస్తున్నారు

Posted : June 19, 2020 at 11:21 pm IST by ManaTeluguMovies


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమా పేరు పుష్పగా ఫిక్స్ అయిన సంగతి తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఏడాది మొదట్లోనే మొదలవ్వాలి కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. మార్చ్ లో షూటింగ్ ను మొదలుపెడదామనుకున్న సమయానికి లాక్ డౌన్ వల్ల దాదాపు మూడు నెలలకు పైగా షూటింగులు చేసుకోవడానికి లేకుండా పోయింది.

ఇక గత వారమే షూటింగులకు అనుమతులు రావడంతో ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇక పుష్ప విషయానికొస్తే చిత్ర కథ ప్రకారం షూటింగ్ ఎక్కువగా దట్టమైన అడవుల్లో చేయాల్సి ఉంది. మొదట థాయ్ ల్యాండ్, కేరళ అడవుల్లో షూటింగ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాని విషయం. తర్వాత హైదరాబాద్ లో స్పెషల్ అడవి సెట్ ను వేద్దామనుకున్నారు కానీ అది అంత వర్కౌట్ కాని విషయమని పుష్ప టీమ్ కు అర్ధమైపోయింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో రోడ్లు షూటింగ్ కు అనువుగా లేదు. షూటింగ్ లో ఛేజ్ సీక్వెన్స్ లు కూడా చేయాల్సి ఉంది. దాంతో పుష్ప టీమ్ 4 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమత్తులు, అవసరమైన చోట కొత్తగా రోడ్లు వేద్దామని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయని అంటున్నారు. అలాగే మారేడుమిల్లికి అత్యంత సమీపంగా ఉండే గోదావరి పరిసరాల్లో సెట్స్ వేస్తున్నట్లు తెలిసింది.

అయితే షూటింగ్ ఎప్పటినుండి మొదలవుతుంది అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

హైదరాబాద్ కు జానీ మాస్టర్ | Jani Master Shifted To Hyderabad

Posted : September 20, 2024 at 1:00 pm IST by ManaTeluguMovies

హైదరాబాద్ కు జానీ మాస్టర్ | Jani Master Shifted To Hyderabad

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad