Advertisement

రాధే శ్యామ్: ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల

Posted : October 21, 2020 at 7:38 pm IST by ManaTeluguMovies

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోన్న విషయం తెల్సిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం 1960ల కాలం నాటి పీరియాడిక్ సెటప్. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ చిత్రం నుండి సర్ప్రైజ్ రానున్న విషయం తెల్సిందే. 23న మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. అయితే ఈరోజు మరో చిన్న సర్ప్రైజ్ విడుదలైంది.

ప్రభాస్ లుక్ ను పోస్టర్ గా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ పేరుని కూడా రివీల్ చేసారు. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. పోస్టర్ కూడా చాలా వైబ్రన్ట్ గా ఉంది. వింటేజ్ కార్ల మధ్యలో ప్రభాస్ అదిరిపోయాడనే చెప్పాలి. ఇటీవలే పూజ హెగ్డే క్యారెక్టర్ పేరుని కూడా రివీల్ చేసిన విషయం తెల్సిందే. ప్రేరణ పేరుతో పూజ ఈ సినిమాలో కనిపించనుంది.

రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ రాధే శ్యామ్ ను నిర్మిస్తోంది.


Advertisement

Recent Random Post:

రాజేంద్ర ప్రసాద్ ను చూస్తే చాలా బాధేస్తుంది: Chiranjeevi Gets Emotional | Rajendra Prasad

Posted : October 5, 2024 at 9:31 pm IST by ManaTeluguMovies

రాజేంద్ర ప్రసాద్ ను చూస్తే చాలా బాధేస్తుంది: Chiranjeevi Gets Emotional | Rajendra Prasad

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad