Advertisement

రాజ్ కుంద్రా కేసు రుజువైతే ఎన్ని ఏళ్ల శిక్ష అంటే?

Posted : July 21, 2021 at 2:01 pm IST by ManaTeluguMovies

అశ్లీల వీడియోలు రూపొందించి యాప్ లో పెట్టి అమ్మారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఈ అశ్లీల వీడియో గ్రఫిపై సరికొత్త చర్చ మొదలైంది. నిషేధిత ఈ అశ్లీల వీడీయోలకు సంబంధించిన చట్టాలుఏమిటీ? వాటికి సంబంధించిన కేసుల్లో కూరుకుపోతే శిక్షలు ఏమిటి? అనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నిజానికి సినిమాలు ఛాయచిత్రాలు పుస్తకాల ద్వారా అశ్లీలతను ప్రచారం చేసినా.. ప్రమోట్ చేసినా చట్టరీత్యా శిక్షకు అర్హులు అనేది చట్టాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అశ్లీలతపై భారతీయ చట్టాలు చూస్తే రాజ్ కుంద్రాకు గట్టి శిక్షనే పడేలా ఉన్నాయని అంటున్నారు.

మన దేశంలో సినిమాల్లో సీరియల్స్ లో సోషల్ మీడియాలో అశ్లీలతను నియంత్రించేందుకు పలు చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.ఇండియన్ పీనల్ కోడ్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ను తీసుకొచ్చారు. ఇండీసెంట్ రిప్రజంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ అండ్ యంగ్ పర్సన్స్యాక్ట్ ఐపీసీ ఐటీయాక్ట్ 2000ను ఈ అశ్లీల వీడియోలపై అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం రాజ్ కుంద్రాపై భారతీయ శిక్షాస్మృతిలోని 420 (మోసం) 34 (సాధారణ ఉద్దేశం) 292 మరియు 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు మరియు ప్రదర్శనలకు సంబంధించినవి) ఐటి చట్టంలోని 67 67 ఎ సెక్షన్లు.. మహిళల అసభ్య ప్రాతినిధ్యం కింద కేసు నమోదు చేశారు.

ఇక ఐటీయాక్ట్2000కు వ్యతిరేకంగా.. అశ్లీల వీడియోలు ప్రమోట్ చేసినా.. కంటెంట్ అప్ లోడ్ చేసినా.. డౌన్ లోడ్ చేసుకున్నా కానీ చట్టరీత్యా శిక్షార్హులు. దీని ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష గానీ లేదా ఐదు లక్షల జరిమానా కానీ లేదా ఈ రెండింటిని కలిపి విధించడానికి అవకాశం ఉంది.

ఇప్పటికే దేశంలో పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం ఉంది. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 900కు పైగా పోర్న్ వెబ్ సైట్లను నిషేధించింది. టెలీ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ తో కలిసి ఇలాంటి పోర్న్ సైట్లను కట్టడి చేస్తోంది. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది.

రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం.. కేసు తీవ్రత దృష్ట్యా ఆరోపణలు నిరూపితమైతే ఆయనకు గట్టి శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. రాజ్ కుంద్రా పలువురు మోడల్ సినీ తారలను అశ్లీల వీడియోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు పలువురు నటీమణులు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుంద్రాపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఒకవేళ కేసులు నిరూపిస్తే కఠిన శిక్షను రాజ్ కుంద్రా ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం 3-5 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చని అంటున్నారు.

మొత్తంగా రాజ్ కుంద్రా ఈ కేసులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టేనని కనిపిస్తోంది.


Advertisement

Recent Random Post:

I Want To Talk – Trailer | Shoojit Sircar | Abhishek A Bachchan | Rising Sun Films | Kino Works

Posted : November 5, 2024 at 8:11 pm IST by ManaTeluguMovies

I Want To Talk – Trailer | Shoojit Sircar | Abhishek A Bachchan | Rising Sun Films | Kino Works

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad