Advertisement

రాజమౌళి ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిన తారక్, చరణ్??

Posted : October 10, 2020 at 6:24 pm IST by ManaTeluguMovies

సాధారణంగా టాప్ దర్శకులతో పని చేసేటప్పుడు ఎలాంటి హీరో అయినా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాడు. తనకు నచ్చిన సాంకేతిక నిపుణుడిని పెట్టుకోవడానికి, తనకు కంఫర్ట్ రీతిలోనే షూటింగ్ చేసుకోమని చెప్పేస్తారు. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయ్యాక మళ్ళీ దాన్ని కదపడానికి ఇష్టపడరు. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకుడు ఉన్నాడంటే ఇక తిరిగి మాట్లాడేది ఏముంటుంది? ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్లిపోవడమే.

అయితే రాజమౌళితో సినిమా చేయడానికి హీరోలకు ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లెమ్ ఆయన నిదానం. ఒక్కో సినిమా రెండు, మూడేళ్ళ పాటు చెక్కుతూనే ఉంటాడు జక్కన్న. అందుకే ప్రభాస్ కు బాహుబలి నుండి బయటకు రావడానికి ఐదేళ్ల పైన పట్టింది. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ తీస్తున్నాడు.

సినిమా మొదలుపెట్టి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా షూటింగ్ పూర్తవ్వలేదు. కరోనా కారణంగా మరింత ఆలస్యమయ్యేలా ఉంది షూట్. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక భిన్న ప్రపోజల్ ను చరణ్, తారక్ ల ముందు ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ఆర్ ఆర్ ఆర్ ను కూడా బాహుబలి టైపులో రెండు భాగాలు చేసి మొదటి భాగాన్ని 2021 సమ్మర్ కు, రెండో భాగాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్.

అయితే దీనికి ఇద్దరు హీరోలు కూడా ససేమీరా అనేశారట. వీలైనంత తొందర్లో ఆర్ ఆర్ ఆర్ షూట్ ను పూర్తి చేసి ఒక్క భాగం కిందే విడుదల చేయమని కోరుతున్నారు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 26th September “2024

Posted : September 26, 2024 at 10:14 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 26th September “2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad