Advertisement

భారీ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్

Posted : November 30, 2020 at 5:57 pm IST by ManaTeluguMovies

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ జరుగుతోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ ఈ షెడ్యూల్ జరగగా ఎక్కువగా నైట్ షూట్స్ చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చలి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఈ నేపథ్యంలో దాదాపు 50 రోజుల పాటు ఈ చలి కాలంలో నైట్ షూట్స్ ను చలికి ఎదురొడ్డి షూట్ చేసారు ఆర్ ఆర్ ఆర్ టీమ్. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు. ఈ షెడ్యూల్ లో ప్రధానంగా యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించినట్లు తెలిపారు.

ఇక అతి త్వరలోనే ఒక సరికొత్త అదిరిపోయే ప్రదేశంలో ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్నాడు జక్కన్న. విడుదల తేదీపై ఇప్పుడే ఎలాంటి డెడ్ లైన్ పెట్టుకోవాలని అనుకోవట్లేదు.

అటు చరణ్ ఇటు ఎన్టీఆర్ క్యారెక్టర్ పరిచయ వీడియోలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Live Class @99 learn.clapingo.com Book now Sponsored 0:35 learn.clapingo.com Skip 0:22 / 1:02 సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు | Daggubati Purandeswari | Supreme Court

Posted : October 1, 2024 at 9:59 pm IST by ManaTeluguMovies

సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు | Daggubati Purandeswari | Supreme Court

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad