Advertisement

ఎక్స్ క్లూజివ్: నిద్రలేని రాత్రులు గడుపుతున్న జక్కన్న

Posted : January 17, 2021 at 8:31 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లుగా ఆర్‌ఆర్ఆర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒక వైపు షూటింగ్‌ తో పాటు మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. పలు దేశాల నుండి ఈ సినిమాకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్ జరుగుతుంది.

దాంతో జక్కన్న అన్నింటిని జాగ్రత్తగా పరిశీలించే ఉద్దేశ్యంతో రాత్రులు కూడా వర్క్‌ చేస్తూ కో ఆర్డినేషన్‌ చేస్తున్నాడు. ప్రతి షాట్ ను ప్రతి సీన్‌ ను పదే పదే చూస్తూ దానికి కావాల్సిన మాడిఫికేషన్స్‌ ను చెప్తు వస్తున్నాడు.

షూటింగ్ లో విదేశీ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటున్న కారణంగా జక్కన్న బిజీ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా సినిమాను ఈ ఏడాది దసరా సందర్బంగా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అవి పుకార్లే అని ఖచ్చితంగా సినిమాను దసరాకు విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు ఉన్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.


Advertisement

Recent Random Post:

QuestionHour With Posani Krishna Murali LIVE | NTV Exclusive Super Hit Political Debate

Posted : April 27, 2024 at 8:45 pm IST by ManaTeluguMovies

QuestionHour With Posani Krishna Murali LIVE | NTV Exclusive Super Hit Political Debate

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement