టాలీవుడ్ దర్శకులలో టాప్ ఎవరు అనే ప్రశ్న వస్తే ఎవరైనా కచ్చితంగా తడుముకోకుండా ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా కొన్ని పరిస్థితులు మారాయి. ఈ మధ్య రాజమౌళి మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ చిత్రం పారసైట్ ను బోరింగ్ సినిమా అని వ్యాఖ్యానించడం, చూస్తూ చూస్తూ పడుకునిపోయా అని చెప్పడం ఇప్పుడు పలు విమర్శలకు తావిచ్చింది.
ఈ వ్యాఖ్యలతో ఒక వర్గం వారు అందరూ ఇప్పుడు జక్కన్నను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన సినిమాల్లో కాపీ కొట్టిన సన్నివేశాలను బయటకు తీస్తూ జక్కన్నను ట్రోల్ చేస్తున్నారు. మాములుగా అయితే ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకునేవారేమో కానీ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. అందుకే ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.
రాజమౌళిపై మొదలైన ట్రోలింగ్ మిగిలిన దర్శకులకు కూడా సోకింది. నెంబర్ 1 దర్శకుడెవరన్న చర్చ అందరిలోనూ మొదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు రావడంతో వెంటనే తన సినిమాల్లో కాపీ సన్నివేశాలపై చర్చ మొదలైంది. గురూజీ అన్న వాళ్లే ఇప్పుడు త్రివిక్రమ్రైజేషన్ పేరుతో కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో సుకుమార్ బెస్ట్ డైరెక్టర్ అన్న చర్చ మొదలైంది. తన సినిమాలు, స్క్రీన్ ప్లే లో ఉండే ఇంటెలిజెన్స్ అన్నీ కలిపి సుకుమార్ ను బెస్ట్ డైరెక్టర్ అన్న కితాబులు మొదలయ్యాయి. తన సినిమాల్లో ప్లాపులు ఉండొచ్చు కానీ ఒరిజినల్ డైరెక్టర్ కాబట్టి సుకుమార్ నెం 1 అని తేల్చేస్తున్నారు. మరి దీనిపై మిగతా ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.