సూపర్ స్టార్ రజినీకాంత్ మరో రెండు వారాల్లో తన పార్టీని ప్రకటించబోతున్నాడు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ తన పార్టీకి ‘మక్కల్ సేవయ్ కచ్చి’ అనే అనే పేరును నిర్ణయించాడట. ఎమ్.ఎస్.కే పేరుతో రజినీకాంత్ పార్టీ కొనసాగబోతుందని అంటున్నారు. ఇక రజినీకాంత్ పార్టీకి ఆటో రిక్షా గుర్తును కేటాయించిందట. రజినీకాంత్ ఆ గుర్తు కోరడంతో ఇతర ఏ పార్టీకి కూడా ఆ గుర్తు ఇవ్వక పోవడం వల్ల ఆటో రిక్షా ను ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
రజినీకాంత్ పార్టీకి సంబంధించి ఈనెల 31న అధికారిక ప్రకటన వెలువడబోతుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పార్టీ ఎం.ఎస్.కే పోటీ చేయబోతుంది. సీఎం కావడమే లక్ష్యంగా రజినీకాంత్ పార్టీ పెడుతున్నాడు. తమిళ నాడు ప్రజలకు మంచి రోజులు తీసుకు వస్తానంటూ రజినీకాంత్ నమ్మకంగా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆయన వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారు. మరో వైపు రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నాడు. ఇక్కడ నుండే తమిళనాట రాజకీయ చర్చలు నిర్వహిస్తున్నాడు.