Advertisement

బర్త్ డే స్పెషల్: టాలీవుడ్ బ్యూటీ రకుల్ మ్యానియా వేరయా..!

Posted : October 10, 2020 at 1:12 pm IST by ManaTeluguMovies

హీరోయిన్లకు సినిమాల్లో స్టార్ డమ్ రావాలంటే సక్సెస్ ఫుల్ సినిమాలు పడాల్సిందే. అదే.. వారి తెరంగేట్రంతోనే స్టార్ డమ్ వస్తే లాంగ్ కెరీర్ సాధ్యమవుతుంది. ఇటువంటి మ్యాజిక్కే చేసింది పంజాబీ ముద్దుగుమ్మ ‘రకుల్ ప్రీత్ సింగ్’. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ భామ తొలి సినిమానే సక్సెస్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించింది. 2014లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఆమె కెరీర్ కు బంగారు బాట వేసింది. అటుపై ఆమె వెనుదిరిగి చూడలేదు.

లౌక్యం, కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, రారండోయ్ వేడుక చేద్దాం.. వంటి హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇవి కాక స్టార్ హీరోలతోనే చేసిన సినిమాలూ ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా సుపరిచితురాలైన రకుల్ అక్కడా సినిమాలు చేసింది. మార్జావన్ లో చేసిన స్పెషల్ సాంగ్ కు మంచి పేరు వచ్చింది. గత ఏడాది అజయ్ దేవ్ గన్ తో చేసిన దేదే ప్యార్ దే సినిమా హిట్ అయింది. తమిళ్ లో కూడ రకుల్ రాణిస్తోంది.

ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ కు ఇన్ స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, నితిన్ తో మరో సినిమా చేస్తోంది. నేడు రకుల్ పుట్టినరోజు.

తెలుగులో సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన రకుల్ ప్రీత్ మళ్ళీ తిరిగి సూపర్ హిట్స్ ట్రాక్ లో వెళ్లాలని కోరుకుంటూ తెలుగుబులెటిన్.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.


Advertisement

Recent Random Post:

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Posted : April 24, 2024 at 8:32 pm IST by ManaTeluguMovies

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement