Advertisement

స్వ‌యం వ‌రం ప్ర‌క‌టించిన స్టార్ హీరోయిన్‌

Posted : July 9, 2020 at 11:21 pm IST by ManaTeluguMovies

స్టార్ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ మ‌న‌సులో ఏదీ దాచుకోరు. టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల‌తో న‌టించిన ఆమెకు పాపులారిటీ అమాంతం పెరుగుతూ వ‌చ్చింది. అప్పుడ‌ప్పుడు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ త‌న అంద‌చందాల‌తో మెరుస్తుంటారు. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానుల‌ను అల‌రిస్తుంటారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప్రేమ‌, పెళ్లి గురించి త‌న దృఢ‌మైన అభిప్రాయాల్ని వ్య‌క్త‌ప‌రిచారు. ప‌నిలో ప‌నిగా త‌న‌కెలాంటి వాడు కావాలో కూడా చెబుతూ స్వ‌యం వ‌రాన్ని ప్ర‌క‌టించినంత ప‌ని చేశారు.

త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి న‌ట‌న‌పై విప‌రీత‌మైన ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చారు. న‌టి కావ‌డం త‌న డ్రీమ్ అని తెలిపారు. అందువ‌ల్లే చిన్న‌ప్పుడే కెమెరా ముందు త‌ళుక్కుమ‌ని మెరిసిన‌ట్టు ఆమె పేర్కొన్నారు. మోడ‌లింగ్‌తో ప్రారంభ‌మైన త‌న సినీ ప్ర‌స్థానం ఒక్క‌రోజులో సెల‌బ్రిటీ కాలేద‌న్నారు. తానీ స్థితిలో ఉండ‌డానికి కొన్ని సంవ‌త్స‌రాల శ్ర‌మ దాగి ఉంద‌ని ఆమె చెప్పారు. 18 ఏళ్ల వ‌య‌సులో త‌న‌కు సినిమా అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. హీరోయిన్‌గా మాత్రం క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ ఇచ్చింద‌న్నారు.

ఇక ప్రేమ‌, పెళ్లిపై ర‌కుల్ ఏం చెప్పారో త‌ప్ప‌క తెలుసుకోవాలి. అలాగే త‌న‌ లైఫ్ పార్ట‌న‌ర్‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాలో కూడా ర‌కుల్ చెప్పుకొచ్చారు.

పెళ్లి అనేది అంద‌మైన అనుభూతిగా అభివ‌ర్ణించారు. కానీ, కొంత మంది ఎందుక‌నో పెళ్లి అన‌గానే తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంటార‌న్నారు. ఇలా ఎందుకో త‌న‌క‌స‌లు అర్థం కాద‌న్నారు. ఎవ‌రినైనా మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించాల‌ని చెప్పారు. తాను అలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న అమ్మాయిన‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.

‘నాకు కాబోయే వాడు నాకన్నా పొడవుగా ఉండాలి. నేను హైహీల్స్‌ వేసుకున్నా నేను అతన్ని తలెత్తుకునే చూడాలి. అంత పొడవుగా ఉండాలి. అలాగే చాలా తెలివైన వ్యక్తి అయి ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించి ఉండాలి’ అని రకుల్‌ చెప్పుకొచ్చారు. అబ్బాయిలూ వింటున్నారా…మ‌రెందుకు ఆల‌స్యం? మీలో ఆ ల‌క్ష‌ణాలున్న వారెవ‌రైనా ఉంటే ఓ ద‌ర‌ఖాస్తు ప‌డేయ కూడ‌దా?


Advertisement

Recent Random Post:

ఎన్నికల ముందు ఏపీలో కీలక పరిణామం | 5 CI’s Transfered In AP

Posted : May 12, 2024 at 8:43 pm IST by ManaTeluguMovies

ఎన్నికల ముందు ఏపీలో కీలక పరిణామం | 5 CI’s Transfered In AP\

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement