Advertisement

వైరల్ వీడియో: ఫిట్ నెస్ లో రకుల్ ని కొట్టేదెలా?

Posted : July 20, 2021 at 10:04 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ హాటెస్ట్ ఫిట్నెస్ ఫ్రీక్ గా రకుల్ ప్రీత్ సింగ్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. జిమ్ వ్యాపార నిర్వాహకురాలిగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ ని కాపాడుకోవడంలో ఎంత కేర్ ఫుల్ గా ఉంటారో తెలిసిందే. సెలబ్రిటీ వరల్డ్ లో ఫిట్ నెస్ పట్ల శ్రద్ధ సహజమే అయినా రకుల్ ఇతరుల కంటే భిన్నం. ఫిట్ నెస్ విషయంలో రకుల్ ఎంత మాత్రం అశ్రద్ధ చేయరు. కెరీర్ పరంగా ఎలాంటి బిజీ షెడ్యూల్ ఉన్నా .. ఆన్ లొకేషన్ సైతం ఫిట్ నెస్ తరగతుల్ని విస్మరించరని చెబుతారు.

యోగా సెషన్ల నుంచి కార్డియో వరకూ..జిమ్ లో వర్కౌట్ల నుంచి ఇంట్లో చేసేలా వ్యాయామల వరకూ అన్నిటా రకుల్ ఎక్స్ పర్ట్. తన జిమ్ యోగా సెషన్లు ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ గా యువతరంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో రకుల్ ఫిట్ నెస్ వీడియోలు అపరిమితంగా వైరల్ అయ్యాయి. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తోన్న మరో కొత్త వీడియోను ఇన్ స్టా వేదికగా పంచుకోగా ఫిట్ నెస్ ఔత్సాహికులను ఆకట్టుకుంది.

జిమ్ములో డంబెల్స్ ఎత్తడం నుంచి కిక్ బాక్సింగ్ వరకూ ప్రతిదీ ఈ వీడియోలో హైలైట్ గా కనిపిస్తోంది. ట్రెడ్ మిల్ పై శ్వేధం చిందిస్తూ ఏ స్థాయిలో శ్రమించిందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతోంది. హై- ఎనర్జిటిక్ వర్కౌట్లతో ఔరా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక.. సైజ్ జీరో వెనక ఇంత శ్రమ దాగుందా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు వృత్తిపరంగా చూస్తే నటిగా రకుల్ చాలా బిజీగా ఉంది. తెలుగు- హిందీ చిత్రాలతో క్షణం తీరి లేకుండా గడుపుతోంది. కొన్ని తమిళ్ సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే అమ్మడి కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ చిత్రాలపైనే ఎక్కువగా కనిపిస్తోందని గుసగుసలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో రకుల్ నటిస్తున్న `సర్ధార్ కా గ్రాండ్సన్` చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాతో డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ లతో కలిసి `మేడే` షూటింగ్ లోనూ రకుల్ పాల్గొంటోంది. ఇటీవల సెకండ్ వేవ్ వల్ల బాలీవుడ్ షూటింగులు బంద్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తిరిగి సెట్స్ కి వెళుతూ రకుల్ కెమెరా కంటికి చిక్కుతోంది. విమానాశ్రయాల్లో హడావుడిగా ప్రయాణాలతో గజిబిజీగా ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మే డే- థాంక్స్ గాడ్- డాక్టర్ జి- ఎటాక్ వంటి చిత్రాలపై రకుల్ ప్రీత్ సింగ్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఇవన్నీ 2021-22 సీజన్లో రిలీజ్ కానున్నాయి.

క్రిష్ తో మూవీ రిలీజ్ ఎపుడు?

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కించిన తాజా చిత్రంలో రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. కొండలు అడవుల్లో ఈ సినిమాని రొటీన్ కి భిన్నంగా తెరకెక్కించారన్న టాక్ ఉంది. ఈ మూవీలో రకుల్ ఓ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. అవార్డ్ కేటగిరీలో కమర్షియల్ చిత్రమిదని భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై క్రిష్ అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

రాజ్ కుంద్రా పోర్న్ స్కాండల్ గురించి శిల్పాశెట్టిని ప్రశ్నిస్తున్న పోలీసులు

Posted : July 23, 2021 at 10:10 pm IST by ManaTeluguMovies

రాజ్ కుంద్రా పోర్న్ స్కాండల్ గురించి శిల్పాశెట్టిని ప్రశ్నిస్తున్న పోలీసులు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement