Advertisement

ఎక్స్ క్లూజివ్: ధృవ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా కన్ఫర్మ్

Posted : October 13, 2020 at 10:52 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు చరణ్. ఎస్ ఎస్ రాజమౌళి దర్సకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే షూటింగ్ తిరిగి మొదలైంది కూడా. వీలైనంత తొందర్లో షూటింగ్ ను పూర్తి చేయాలనీ భావిస్తున్నాడు జక్కన్న. ఆర్ ఆర్ ఆర్ కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు చరణ్. దాదాపు 30 నిముషాలు నిడివున్న పాత్ర కోసం షూటింగ్ వచ్చే నెల నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ ప్రధాన పాత్రలో కనిపించబోయే చిత్రం గురించి బోలెడన్ని ఊహాగానాలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే ఎన్ని రూమర్స్ వస్తున్నా వాటిలో నిజం లేదని కొద్ది రోజులకే బయటపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మాకు అందిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం రామ్ చరణ్, తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నటించనున్నాడని సమాచారం.

మోహన్ రాజా తమిళంలో తెరకెక్కించిన తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి రామ్ చరణ్ తో ధ్రువగా తెరకెక్కించి సూపర్ హిట్ అందించాడు. ఇక మోహన్ రాజా – రామ్ చరణ్ కు సంబంధించిన మూవీ అప్డేట్ పై త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.


Advertisement

Recent Random Post:

Big Twist in Phone Tapping Case : కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించిన రాధాకిషన్

Posted : May 3, 2024 at 3:50 pm IST by ManaTeluguMovies

Big Twist in Phone Tapping Case : కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించిన రాధాకిషన్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement