Advertisement

రామ్ గోపాల్ వర్మ లిప్ కిస్ కహానీ !

Posted : May 4, 2022 at 9:28 pm IST by ManaTeluguMovies

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన డేంజరస్ మూవీ ఈ వారం విడుదలకు సిద్దం అయ్యింది. గత నెలలోనే ఈ సినిమాను విడేదల చేసేందుకు అంతా సిద్దం చేశారు. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగింది. మళ్లీ ఈ సినిమా థియేటర్ రిలీజ్ ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్న సమయంలో ఈనెల 6న విడుదల చేయబోతున్నట్లుగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈసారి కూడా సినిమా ప్రమోషన్ కోసం వర్మ హడావుడి చేస్తున్నాడు. ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ కూడా స్వలింగ సంపర్కులుగా చూపించడం జరిగింది. ఇండియాలోనే మొదటి స్వలింగ సంపర్కుల మూవీగా దీన్ని చెబుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్స్ ముద్దు పెట్టుకునే సన్నివేశాల చిత్రీకరణ విషయమై వర్మ స్పందిస్తూ.. లిప్ లాక్ సన్నివేశాలను గురించి వివరించాల్సి వచ్చిన సమయంలో చేసి చూపించేవాడిని కాదు. ముద్దు సన్నివేశాలను వివరించే వాడిని. వాటిని సరిగ్గా వచ్చేంత వరకు నైనా మరియు అప్సరలపై షూట్ చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

ఇతర సన్నివేశాలను వివరించి.. చేసి చూపించినట్లుగా ముద్దు సన్నివేశాలను చూపించేవాడానికి కాదని వర్మ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. తాను అనుకున్న విధంగా ముద్దు సన్నివేశం వచ్చేంత వరకు పదే పదే రీ షూట్ లను చేసేవాడంటూ హీరోయిన్స్ చెప్పుకొచ్చాడు.

అప్సర రాణి మాట్లాడుతూ ముద్దు పెట్టుకోవాల్సి వస్తే నైనా పెదాలను ముద్దు పెట్టుకుంటాను.. వర్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాను అన్నట్లుగా మనసులో మాట చెప్పుకొచ్చింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు గతంలో మాదిరిగా అగ్రసివ్ గా చేయడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో మా ఇష్టం అంటూ ఈ డేంజరస్ మూవీ విడుదల కాబోతుంది. వర్మ ఈ మద్య ఏం చేసినా ఫ్లాప్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

జగన్‌కు దిమ్మతిరిగే తీర్పును ఇచ్చిన విశాఖ ప్రజలు | Vizag People Give Big Shock To CM Jagan

Posted : June 6, 2024 at 12:41 pm IST by ManaTeluguMovies

జగన్‌కు దిమ్మతిరిగే తీర్పును ఇచ్చిన విశాఖ ప్రజలు | Vizag People Give Big Shock To CM Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement